Jawan Movie: బాద్ షా రేంజ్ ఇది.. ఏడు రోజుల్లో రూ.600 కోట్లు.. ‘జవాన్’ రికార్డ్..

కొద్ది రోజుల క్రితం పఠాన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన ఖాన్.. ఇప్పుడు జవాన్ సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ సినిమా థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు 500 కోట్లు మార్క్ క్రాస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.600 కోట్ల క్లబ్ లోకి చేరంది. ఏడవ రోజున దాదాపు రూ.21.50 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం భారతదేశంలోనే అన్ని భాషల్లో కలిపి మొత్తం రూ.366 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

Jawan Movie: బాద్ షా రేంజ్ ఇది.. ఏడు రోజుల్లో రూ.600 కోట్లు.. 'జవాన్' రికార్డ్..
Jawan Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2023 | 4:43 PM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద జవాన్ చిత్రం సత్తా చాటుతోంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. కొద్ది రోజుల క్రితం పఠాన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన ఖాన్.. ఇప్పుడు జవాన్ సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ సినిమా థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు 500 కోట్లు మార్క్ క్రాస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.600 కోట్ల క్లబ్ లోకి చేరంది. ఏడవ రోజున దాదాపు రూ.21.50 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం భారతదేశంలోనే అన్ని భాషల్లో కలిపి మొత్తం రూ.366 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

ఇక మంగళవారంతో పోలిస్తే బుధవారం వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ సినిమాకు రెస్పాన్స్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఏడో రోజు మొత్తం రూ.23 కోట్లు రాబట్టగా.. అందులో హిందీ వెర్షన్ కు రూ.21.5 కోట్లు… తమిళంలో రూ.95 లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.85 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్ లోనూ జవాన్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మొదటి రోజు రూ.75 కోట్లు రాబట్టి బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది జవాన్ చిత్రం. ఆ తర్వాత ఆరు రోజుల్లోనే రూ.500 కోట్లకు క్రాస్ చేసింది. ఇక ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. విడుదలైన ఏడు రోజుల్లోనే మొత్తం రూ.821 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

తొలిసారి షారుఖ్ మాస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించగా.. బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొణె అదితి పాత్రలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి పది వేలకు థియేటర్లు కేటాయించగా.. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 3 వేలకు పైగా థియేటర్స్ అందించారు. ఈ సినిమాకు ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.