Rashmika Mandanna: రష్మిక జిమ్ కష్టాలు.. కష్టమైనా నొప్పిని భరిస్తూ లెగ్ వర్కౌట్స్.. డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా..
పుష్ప 2 చిత్రీకరణలోనూ పాల్గొంటుంది. ఇటీవలే ఆమె సెట్ లో అడుగుపెట్టినట్లు తెలియజేస్తూ పుష్పరాజ్ విల్లాను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో తెగ కష్టపడుతోన్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా హీరోయిన్స్ ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. జిమ్ లో కష్టతరమైన వర్కవుట్స్ చేయడం.. డైట్ ఫాలో కావడం చేస్తుంటారు. తాజాగా రష్మిక లెగ్ వర్కౌట్ తో ఎంత కష్టపడుతుందో ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది.
పాన్ ఇండియా లెవల్లో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో ఈ అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు ప్రశంసలు అందుకుంది. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో హిందీలో వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రష్మిక. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలతో నార్త్ అడియన్స్ ను అలరించిన ఈ కన్నడ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతుంది. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
మరోవైపు పుష్ప 2 చిత్రీకరణలోనూ పాల్గొంటుంది. ఇటీవలే ఆమె సెట్ లో అడుగుపెట్టినట్లు తెలియజేస్తూ పుష్పరాజ్ విల్లాను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో తెగ కష్టపడుతోన్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా హీరోయిన్స్ ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారన్న సంగతి తెలిసిందే. జిమ్ లో కష్టతరమైన వర్కవుట్స్ చేయడం.. డైట్ ఫాలో కావడం చేస్తుంటారు. తాజాగా రష్మిక లెగ్ వర్కౌట్ తో ఎంత కష్టపడుతుందో ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది.
View this post on Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో రష్మిక లెగ్ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా మార్చుకుంటుంది. అవి చేస్తున్నప్పుడు ఎంత నొప్పిగా ఉన్నా.. దానిని భరిస్తూ ఆమె వర్కౌట్స్ చేయడం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న రష్మిక కష్టం చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆమె డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. యానిమల్, పుష్ప 2 చిత్రాలు మాత్రమే కాకుండా రష్మిక చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి. ఇటు నితిన్ సరసన ఓ సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ నుంచి రష్మిక తప్పుకుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రష్మికకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.