Shah Rukh Khan: అల్లు అర్జున్ స్వాగ్‌కు నేను సెట్ అవ్వను.. పుష్ప పై షారుక్ కామెంట్స్
షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, 'ఇతర స్టార్స్‌కి ఆఫర్లు ఇవ్వకుండా కథను మొదట నా దగ్గరకు వచ్చిన సినిమాలు చాలా చేశాను అన్నాడు. దానికి విక్కీ కౌశల్ స్పందిస్తూ.. తాను చాలా ఆఫర్లను తిరస్కరించినట్లు షారుక్ ఖాన్‌తో చెప్పాడు. ఈ సమయంలో, అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' గురించి కూడా మాట్లాడుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారుక్ ఏ సినిమా చేసినా ఫ్యాన్స్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. జవాన్ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ బాద్షా.. తాజాగా ఇటీవల విక్కీ కౌశల్‌తో కలిసి IIFA అవార్డులను హోస్ట్ చేశాడు షారుక్. ఈ స్టేజ్ పై షారుక్ తనదైన స్టైల్ లో సందడి చేశాడు.
ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్
షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, ‘ఇతర స్టార్స్‌కి ఆఫర్లు ఇవ్వకుండా కథను మొదట నా దగ్గరకు వచ్చిన సినిమాలు చాలా చేశాను అన్నాడు. దానికి విక్కీ కౌశల్ స్పందిస్తూ.. తాను చాలా ఆఫర్లను తిరస్కరించినట్లు షారుక్ ఖాన్‌తో చెప్పాడు. ఈ సమయంలో, అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ గురించి కూడా మాట్లాడుకున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ నటించారు. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘లాల్ సింగ్ చద్దా సినిమా మీ దగ్గరకు వచ్చిందంటగా.?’ అని అడిగాడు. దానికి షారుక్ ఫన్నీగా సమాధానమిచ్చాడు. అమీర్ ఖాన్ కూడా ఆ సినిమా తీయకూడదని అన్నాడు. ఆ తర్వాత ‘ఐ లవ్ యూ అమీర్’ అన్నాడు.
ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి
‘లాల్ సింగ్ చద్దా’ 2022లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా కేవలం 130 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీని తర్వాత అమీర్ ఖాన్ నటనకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ‘పుష్ప’ సినిమా గురించి కూడా షారుక్ మాట్లాడారు. పుష్ప టైటిల్ విని షారూఖ్ థ్రిల్ అయ్యాడు. ‘ నేను పుష్ప సినిమా చేయాలి. కానీ, అల్లు అర్జున్ స్వాగ్‌కు నేను సెట్ అవ్వను’ అని అన్నాడు. ‘పుష్ప’ చిత్రంలో నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు దక్కింది. షారుక్ ఖాన్‌కి ఇప్పటి వరకు జాతీయ అవార్డు రాలేదు.
ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి