నా కూతురు ఎవర్ని పెళ్లి చేసుకుంటే మీకెందుకురా..! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో
తన నటనతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టేశాడు. స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత హీరోగా స్థిరపడిపోయాడు. కథానాయకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

ఒకప్పుడు హీరోలుగా ఎదిగి.. ఇప్పుడు విలన్స్ గా, సైడ్ క్యారెక్టర్స్ రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో కూడా అదే కోవకు చెందినవారే.. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఆయన సినిమా వస్తుందంటే చాలు పేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. లేడీస్ లో ఆయన ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి ప్రేక్షకులను అలరిస్తారు ఆయన. కాగా గతంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.ఇంతకూ ఆయన ఎవరు.? ఆయన చేసిన కామెంట్స్ ఏంటి..?
ఎంత పని చేశావ్ అమ్మడు..! హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి..! కారణం తెలిసి షాక్ తిన్న బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ఒకరు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ల్లో జగపతిబాబుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అప్పుడు క్యూట్.. ఇప్పుడు యమా హాట్..! పాపను కొంచం పట్టించుకోండయ్యా..!
ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. “నా కూతురు ఎవరో విదేశీయుడిని పెళ్లి చేసుకుంటుందని కొంతమంది నా కులానికి చెందిన వారు.. ఇంత పెద్ద ఫ్యామిలీ మీది.. వీరమాచినేని ఫ్యామిలీ అంటే నాలుగు పెద్ద ఫ్యామిలీలో ఒకటి.. అలాంటిది మీ అమ్మాయి ఓ తెల్లోడిని చేసుకుంటుందా..? వాడిని ఎలాగోలా అక్కడి మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించి.. జీవితాల్లో బయటకు రాకుండా చేద్దాం.. అని కొంతమంది కుట్ర చేశారు అని అన్నారు. “జనం ఎంత వెనకబడి ఉన్నారో ఇది చూస్తే అర్ధమవుతుంది. నేను వాళ్లకు చెప్పా.. మీరు ఈ ఎదవ ఆలోచనలు, ఎదవ పనులు చెయ్యొద్దు. నువ్వు అలా చేస్తే నా జీవితమంతా నేను వాడిని బయటకు ఎలా తీసుకురావాలని అని నేను ఇబ్బందిపడతా.. మా అమ్మాయి, ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు. మీకెందుకు అయ్యా మధ్యలో.. మాకు లేని గొడవ మీకెందుకు అని చెప్పా.. ఏంటి కులం.? మనమేమైనా పుట్టించామా..? నేను హైదరాబాద్ లో ఉంటున్నా అంటే నేను ఉంటున్నా అంతే.. హైదరాబాద్ నాది కాదు.. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతారు.. అందుకే నేను జనాలను ఎక్కువగా కలవను” అని అన్నారు జగపతి బాబు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు ఫ్లాప్స్.. కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఛాన్స్‌లు కరువువాయే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








