ఎంత పని చేశావ్ అమ్మడు..! హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి..! కారణం తెలిసి షాక్ తిన్న బ్యూటీ
హీరోలకే కాదు హీరోయిన్స్ కు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోలకు సమానంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. అయితే అభిమానుల వల్ల అప్పుడప్పుడూ హీరోయిన్ అవస్థలు పడుతూ ఉంటారు .. అలాగే ఓ హీరోయిన్ వల్ల అభిమాని పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట..

సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఆమె అందానికి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. మొదట్లో పంజాబీ చిత్రాల్లో నటించిన సోనమ్ ఇప్పుడు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవలే హౌస్‌ఫుల్ 5 సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి బయటపెట్టింది. అది విని తనకు సంబంధం లేకుండానే తన వీరాభిమాని పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యానంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. తన కారణంగానే ఓ అభిమాని వివాహం ఆగిపోయిందని.. ఆ విషయం కూడా తనకు తెలియదని తెలిపింది.
ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం
ఓ ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. “ఓ ఈవెంట్ కోసం మా సొంతూరికి వెళ్లాను. మా టీం మొత్తం బరేలీ విమానాశ్రయం నుంచి వెళ్లాము. తిరిగి వస్తుండగా.. ఆ ఎయిర్ పోర్టులో ఓ మహిళ నా వద్దకు వచ్చింది. నేను అప్పుడు మాస్క్ ధరించి ఉన్నాను. అయినా తను నన్ను గుర్తుపట్టింది. నువ్వు సోనమ్ బజ్వానా..? అంటూ పలకరించింది. నేను ఏమి అనకుండా స్మైల్ ఇచ్చాను. నీ కారణంగానే నా వివాహం ఆగిపోయింది అని చెప్పింది. నాకు ఎలా స్పందిచాలో కూడా అర్థం కాలేదు. కానీ తన పెళ్లి ఆగిపోయినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే ఆ వ్యక్తి నా వీరాభిమాని అని ఆ మహిళ చెప్పింది. పూర్తిగా నీ మత్తులో మునిగిపోయాడు. అందుకే ఆ వ్యక్తితో పెళ్లికి నో చెప్పాను అని ఆ మహిళ నాతో చెప్పింది” అంటూ సోనమ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని తెలిపింది.
తస్సాదియ్యా.. ఇది కదా మార్పు అంటే..! 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించిన ఈ చిన్నది ఎంత
సోనమ్ బజ్వా 2013లో బెస్ట్ ఆఫ్ లక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పంజాబ్ 1984, సర్దార్ జీ, నిక్కా జైల్దార్. జింద్ మహి. కాట్టేరి,హౌస్‌ఫుల్ 5 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాఘీ 4 చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది.
ఐరెన్ లెగ్ అన్నారు.. 9 సినిమాలనుంచి తీసేసారు.. కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








