Potti Veeraiah death: టాలీవుడ్ లో ఆక‌స్మిక విషాదం.. సీనియ‌ర్ న‌టుడు పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌

మరుగుజ్జు నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య..

Potti Veeraiah death: టాలీవుడ్ లో ఆక‌స్మిక విషాదం.. సీనియ‌ర్ న‌టుడు పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌
Potti Veraiah Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 25, 2021 | 7:55 PM

మరుగుజ్జు నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య.. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. వీర‌య్య సాయంత్రం 4.33 నిమిషాలకు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. సోమ‌వారం వీరయ్య అంత్య‌క్రియ‌లు మహా ప్రస్థానంలో జ‌ర‌గ‌నున్నాయి.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500కుపైగా చిత్రాల్లో వీర‌య్య న‌టించాడు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య ‘అగ్గివీరుడు’ చిత్రంతో నటుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యాడు. దాసరి ప్రొత్సాహంతో ‘తాతమనవడు’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన పొట్టి వీరయ్య ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ‘రాధమ్మ పెళ్లి’,  ‘యుగంధర్‌’, ‘జగన్మోహిని’, ‘గజదొంగ’, ‘అత్తగారి పెత్తనం’, ‘గోల నాగమ్మ’, ‘టార్జాన్‌ సుందరి’ తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు.  వీరయ్య భార్య మల్లిక 2008లో కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.  చిన్న కుమార్తె విజ‌య దుర్గ కూడా న‌టిగా రాణిస్తున్నారు. వీరయ్య నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామంలో జన్మించారు.

Also Read: పెద్ద విష‌పు పామును ముప్పుతిప్ప‌లు పెట్టిన చిన్న గండు చీమ‌.. మెడ‌పై గ‌ట్టిగా కొరికి.. కొరికి

వింత దేశం: ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వ‌రుడు తిమింగలం చేపల పళ్ళు తీసుకురావాలి