AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Naresh: అతడు ఆమె మధ్యలో ఈమె.. నరేష్ నాలుగో పెళ్లి సస్పెన్స్‌కు తెర…

సీనియర్ నటుడు నరేష్‌... మరోసారి పెళ్లి వివాదంలో చిక్కుకున్నారు. నటి పవిత్రా లోకేష్‌తో నరేష్ పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ.. ఆయన మూడో భార్య రమ్యరఘుపతి ఎంట్రీ ఇవ్వడంతో నరేష్ నాలుగో పెళ్లి సస్పెన్స్‌లో పడింది

Actor Naresh: అతడు ఆమె మధ్యలో ఈమె.. నరేష్ నాలుగో పెళ్లి సస్పెన్స్‌కు తెర...
Naresh
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2022 | 12:02 PM

Share

సీనియర్ నటుడు నరేష్‌(Naresh)… మరోసారి పెళ్లి వివాదంలో చిక్కుకున్నారు. నటి పవిత్రా లోకేష్‌తో నరేష్ పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ.. ఆయన మూడో భార్య రమ్యరఘుపతి ఎంట్రీ ఇవ్వడంతో నరేష్ నాలుగో పెళ్లి సస్పెన్స్‌లో పడింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు దాకా హల్‌చల్‌ చేస్తోంది నరేష్ తాజా మారేజ్ ఎపిసోడ్. పవిత్రతో కలిసి ఇటీవల మహాబలేళ్వరం టెంపుల్‌కు వెళ్లారు నరేష్. అప్పటి నుంచి వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆల్రెడీ పెళ్లయిందన్న వెర్షన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్‌గా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్‌లోకొచ్చారు. నరేష్‌ను తనను మోసం చేశారంటూ బెంగుళూరులో రిపీటెడ్‌గా మీడియా ముందుకొస్తున్నారు. నరేషూ నేనూ కలిసి లేము… అలాగని విడాకులూ తీసుకోలేదు.. మాకు పిల్లలు కూడా ఉన్నారు.. అటువంటప్పుడు మళ్లీ మ్యారేజ్ కోసం ఎలా ఏర్పాట్లు చేస్తారని ప్రశ్నిస్తున్నారు రమ్య. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకుంటే నా గతేం కాను అని నిలదీస్తున్నారు. జనవరిలో కేసు రిజిస్టర్ చేశారు. జూన్‌లో నోటీసులొచ్చాయి… అయినా ఆయనిచ్చిన నోటీసులపై కోర్టులో లీగల్ ఫైట్ చేస్తాను.. అంటున్నారు. అందాకా నరేష్ మరో పెళ్లి చేసుకోకూడదన్నది రమ్య పెడుతున్న కండిషన్.

రమ్య చెప్పేదంతా అబద్ధం అనేది నరేష్ మాట. ఆమె నా కుటుంబాన్ని నాశనం చేసింది. యాభై లక్షలడిగి బ్లాక్‌మెయిల్ చేసింది.. క్రిష్ణ గారు చెబితే పది లక్షలిచ్చా.. ఇంకా వదిలిపెట్టలేదన్నారు నరేష్. అలాగని పవిత్రను పెళ్లి చేసుకుంటానని చెప్పడం లేదు నరేష్. తనకు ఎమోషనల్ సపోర్ట్ అవసరమని, అందుకే పవిత్రతో స్నేహంగా ఉన్నానని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది రమ్య. ఓ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పడు నరేశ్‌తో పరిచయం ఏర్పడిందామెకు. ఇరు కుటుంబాల వారిని ఒప్పించి తొమ్మిదేళ్ల కిందట నరేష్, రమ్య పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన మూడేళ్లకే విడిపోయారు రమ్య అండ్ నరేశ్.

నరేష్‌, రమ్య మధ్య వివాదం నడుస్తుండగానే పవిత్ర భర్త, కన్నడ డైరెక్టర్ సుచేంద్ర సీన్లోకొచ్చారు. ఆయన పవిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటేనని, ఆమెది పైలాపచ్చీసు జీవితమని, అందుకే తనను వదిలేసి వెళ్లిందని చెప్పారు సుచీంద్ర. కానీ.. సుచేంద్రను పెళ్లే చేసుకోలేదంటున్నారు పవిత్ర. ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నరేష్‌తో కలిసి ఉంటున్నా, నన్ను అతను ఫ్యామిలీ మెంబర్‌గా అంగీకరించారని చెప్పారు. పవిత్ర, నరేష్‌ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఐదేళ్ల కిందట హ్యాపీ వెడ్డింగ్ సినిమా టైమ్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. సమ్మోహనం సినిమా టైమ్‌లో వీరిద్దరి స్నేహం కుదిరింది. అప్పటి నుంచి వీరు కలిసి జీవిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఇద్దరిని పెళ్లిచేసుకుంది పవిత్ర. ఇప్పుడు నరేష్‌కీ, పవిత్రకీ 26 ఏళ్ల ఏజ్‌ గ్యాప్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి