AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakka Commercial Movie Review: టైటిల్‌కి తగ్గట్టే పక్కా కమర్షియల్‌ మూవీ!

సినిమాలకు టైటిల్స్ పెట్టడంలో మారుతికంటూ ఎప్పుడూ ఓ మార్కు ఉంటుంది. లేటెస్ట్ సినిమా పక్కా కమర్షియల్‌ టైటిల్‌లోనూ అది పర్ఫెక్ట్ గా కనిపించింది.

Pakka Commercial Movie Review: టైటిల్‌కి తగ్గట్టే పక్కా కమర్షియల్‌ మూవీ!
Pakka Commercial
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 01, 2022 | 1:02 PM

Share

సినిమాలకు టైటిల్స్ పెట్టడంలో మారుతికంటూ ఎప్పుడూ ఓ మార్కు ఉంటుంది. లేటెస్ట్ సినిమా పక్కా కమర్షియల్‌ టైటిల్‌లోనూ అది పర్ఫెక్ట్ గా కనిపించింది. కామెడీ యాంగిల్‌ని పోట్రే చేసే మారుతి,  కామెడీ టింజ్‌ని వర్కవుట్‌చేసే గోపీచంద్‌ కలిసి చేసిన సినిమా పక్కా కమర్షియల్‌. శుక్రవారం స్క్రీన్స్ మీదకు వచ్చిన పక్కా కమర్షియల్‌ ఎలా ఉంది? చూసేద్దాం

సంస్థ: యువీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్

నటీనటులు: గోపీచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌, కిరణ్‌ తలశిల, సప్తగిరి, సాయికృష్ణ, రమణా రెడ్డి తదితరులు

ఇవి కూడా చదవండి

సంగీతం: జేక్స్ బిజోయ్‌

ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌

కెమెరా: కర్మ్ చావ్లా

నిర్మాత: బన్నీవాసు

సహ నిర్మాతలు: ఎస్‌.కె.ఎన్‌, బాబు

సమర్పణ: అల్లు అరవింద్‌

రచన-దర్శకత్వం: మారుతి

విడుదల: జులై 1, 2022

లక్కీ (గోపీచంద్‌) కమర్షియల్‌ లాయర్‌. బయట కమర్షియల్‌గానే ఉన్నా, తండ్రి ముందు మాత్రం నాన్‌ కమర్షియల్‌గా నటిస్తుంటాడు. సినిమాల్లో సీరియళ్లు చేసే అమ్మాయి ఝాన్సీ (రాశీఖన్నా). సీరియల్లో చేసే లాయర్‌ కేరక్టర్‌ ఆథంటిక్‌గా ఉండాలని లా కంప్లీట్‌ చేసి ఉంటుంది. ఒకానొక సందర్భంలో లక్కీ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది. ఆమె అమాయకత్వంతో చేసిన కొన్ని పనుల వల్ల తండ్రికి లక్కీ నిజ స్వరూపం తెలిసిపోతుంది. జడ్జిగా పనిచేసిన లక్కీ తండ్రి (సత్యరాజ్‌) అప్పుడేం చేస్తారు? వివేక్‌(రావు రమేష్‌) కాంపౌండ్‌లోకి లక్కీ ఎందుకు అడుగుపెడతాడు? వివేక్‌ వల్ల మాజీ జడ్జికి జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెరమీద చూడాల్సిందే.

టైటిల్‌కి తగ్గట్టే కమర్షియల్‌గా తీశారు సినిమాని. గోపీచంద్‌ లుక్‌, స్టైల్‌ బావున్నాయి. రాశీఖన్నా మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారు. మారుతి డైలాగులు బావున్నాయి. అజయ్‌ఘోష్‌ మేనరిజం థియేటర్లో నవ్వులు కురిపించింది. ట్రెండ్‌కి తగ్గ డైలాగులతో మెప్పించే ప్రయత్నం చేశారు మారుతి. సర్‌ప్రైజింగ్‌ రోల్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కనిపిస్తారు. సప్తగిరి, వైవాహర్ష కేరక్టర్లు సినిమా స్టార్టింగ్‌లో నవ్వు తెప్పిస్తాయి. పక్కా కమర్షియల్‌ టైటిల్‌ సాంగ్‌, అందాల రాశి పాట, అదిరింది మాస్టారు మీ పోస్టర్‌ సాంగ్‌, లెహంగాలో లేడీ డాను.. సాంగ్‌ సందర్భోచితంగా వస్తాయి.

తండ్రి ఒక విషయంలో పశ్చాత్తాపపడటం, ఎదుగుతున్న కొడుకు దాన్ని చూసి ఓర్చుకుంటూ భరించడం, పెద్దయ్యాక ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్‌ రొటీనే అయినా, న్యాయవాదులకు సంబంధించి క్లైమాక్స్ లో చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. ఏ తప్పు చేసినా న్యాయవాదులు కాపాడుతారులే అనే ధోరణిలో  మార్పు రావాలని, తప్పు చేస్తే ఏ లాయరూ తమ వైపు వాదించరనే భయం జనాల్లో పుట్టాలని హీరో చెప్పే మాటలు అర్థవంతంగా ఉన్నాయి.

సినిమా టైటిల్‌కి తగ్గట్టే పక్కా కమర్షియల్‌ సినిమా ఇది! 

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి