Sonali Bindre: ఆ సమస్యలతోనే సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిందా? తనపై వస్తోన్న పుకార్ల గురించి సోనాలి ఏమందంటే..
Sonali Bindre: మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ముంబై ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ అందాల తార..
Sonali Bindre: మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ముంబై ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ అందాల తార 2013లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబార అనే చిత్రంలో చివరిగా కనిపించింది. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అమెరికాలో చికిత్స చేయించుకున్న ఆమె మనోధైర్యంతో క్యాన్సర్ మహమ్మారిని జయించింది. ఈ క్రమంలోనే సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. బ్రోకెన్ న్యూస్ అనే వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ సిరీస్ విడుదలైంది. ఇదిలా ఉంటే సోనాలి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆఫర్స్ కావాలంటూ దర్శక నిర్మాతలకు ఆమె విజ్ఞప్తి చేసుకుంటుందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించింది సోనాలి. తాను ఆర్థికంగానూ, అన్ని విధాలుగా బాగున్నానని, ఆఫర్స్ అడుక్కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
నాకు ఆ అవసరం లేదు..
‘నాకు డబ్బు సమస్య ఉందంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేను ఆర్థికంగా ఎంతో బాగున్నాను. ఆఫర్స్ కోసం అడుక్కోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు’ అని తేల్చిపారేసింది సోనాలి. దీంతో పాటు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ 30 సినిమాల్లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో సైతం నిజం లేదని వెల్లడించింది. ప్రస్తుతం నేను ఎలాంటి సినిమాలకు సంతకం చేయలేదని, మంచి కథ, పాత్ర నచ్చితే తప్పకుండ చేస్తానని పేర్కొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..