Ram Pothineni: రామ్ పోతినేని జోడిగా బాలీవుడ్ బ్యూటీ.. సౌత్ ఇండస్ట్రీలోకి సైఫ్ కూతురు..
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది.

ప్రస్తుతం స్కంద సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో రామ్ పోతినేని. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత రామ్ మరోసారి పూరి డైరెక్షన్లో వర్క్ చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది.
అయితే ఇప్పటివరకు బాగానే ఉంది.. కానీ ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా చెప్పలేదు. తాజాగా ఈ సినిమాలో కథానాయిక ఫిక్స్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.ఈ చిత్రంలో రామ్ సరసన బేబీ మూవీ బ్యూటీ వైష్ణవి చైతన్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. బీటౌన్లో ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సారా అలీ ఖాన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈమూవీతో సారా తెలుగు తెరకు పరిచయం కానుంది.
View this post on Instagram
ఇప్పటికే పూరి చాలా మంది కొత్త హీరోయిన్స్ లేదా బాలీవుడ్ హీరోయిన్స్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇటీవల లైగర్ సినిమాతో బీటౌన్ బ్యూటీ అనన్య పాండేను సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో తెలుగులో అనన్యకు అంతగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి బీటౌన్ బ్యూటీని తెలుగు వాళ్ల ముందుకు తీసుకురాబోతున్నారు పూరి.
View this post on Instagram
ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది సారా. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది సారా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.