AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: వరుస ఆఫర్లలతో సమంత బిజీ బిజీ.. రాజమౌళి సినిమాలో హీరోయిన్‏గా సామ్ ?..

సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. విడాకుల ప్రకటన అనంతరం సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

Samantha: వరుస ఆఫర్లలతో సమంత బిజీ బిజీ.. రాజమౌళి సినిమాలో హీరోయిన్‏గా సామ్ ?..
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2021 | 2:38 PM

Share

సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. విడాకుల ప్రకటన అనంతరం సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దీంతో ఆమె పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగింది. అయితే వాటితో తనకేలాంటి సంబంధం లేనట్టుగా తన పని తాను చేసుకుంటూ పోతుంది సమంత. గత కొద్ది రోజులుగా తన పర్సనల్ విషయాలతో పాటు.. కొన్ని మోటీవేటివ్ కోట్స్ నెట్టింట్లో షేర్ చేస్తుంది. ఇక సామ్ ఇప్పుడు సినిమాల పరంగా దూసుకుపోతుంది.. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వివాహం తర్వాత సామ్ సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఉమెన్ ఒరియేంటెడ్ మూవీస్ చేస్తూ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సమంత తన సత్తా చాటుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంది.

ఈ క్రమంలోనే సామ్.. వరుస ఆఫర్లకు ఒకే చెబుతుందని టాక్. ఇక స్టార్ హీరోయిన్ తాప్సీ పన్నూ సొంత బ్యానర్లో బాలీవుడ్ ఇవ్వబోతన్నట్లుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో సామ్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక తాజాగా సమంత తదుపరి చిత్రం గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో సమంతను హీరోయిన్‏గా ఎంపికచేసినట్లుగా టాక్. ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్‏తో ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్‏గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read: Suriya Jai Bheem: వివాదంలో సూర్య జై భీమ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతున్న వన్నియార్ సంగం..

Lakshmi Manchu: మలయాళంలో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తోన్న మంచు లక్ష్మీ.. మోహన్‌లాల్‌ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటన..

Sharukh Khan: తనయుడు ఆర్యన్ కోసం బాడీ గార్డ్ వేటలో పడిన కింగ్ ఖాన్.. రెడ్ చిల్లీస్‌కి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్