Aliabhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం వెనక్కు తగ్గిన గంగూబాయి.. విడుదల ఎప్పుడంటే..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల కోసం యావత్‌ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ పీరియాడికల్‌ సినిమాలో

Aliabhatt: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం వెనక్కు తగ్గిన గంగూబాయి.. విడుదల ఎప్పుడంటే..
Follow us

|

Updated on: Nov 15, 2021 | 1:29 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల కోసం యావత్‌ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ పీరియాడికల్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఓలీవియా మోరీస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పాటలు, గ్లింప్స్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఇదే సమయానికి సంజయ్‌లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ‘గంగూబాయి కథియావాడి’ కూడా థియేటర్లలోకి రానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తో్న్న ఈ సినిమాను జనవరి 6న విడుదల చేయాలని ఇది వరకే చిత్రబృందం ప్రకటించింది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఇలా రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఒకరోజు గ్యాప్‌లో విడుదలైతే అది కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవు. దీంతో ముందుగా అనుకున్న విడుదల తేదీ నుంచి ‘గంగూబాయి’ వెనక్కు తగ్గింది. జనవరి 6న కాకుండా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలీవుడ్‌లో కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సోలో రిలీజ్‌ లభించినట్లయింది.

Also Read:

Lakshmi Manchu: మలయాళంలో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తోన్న మంచు లక్ష్మీ.. మోహన్‌లాల్‌ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటన..

Dance Video Viral: టాలెంట్‌ఏ ఒక్కరి సొంతం కాదు.. ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు బాహుబలి భామ ఫిదా.. వీడియో వైరల్

Sharukh Khan: తనయుడు ఆర్యన్ కోసం బాడీ గార్డ్ వేటలో పడిన కింగ్ ఖాన్.. రెడ్ చిల్లీస్‌కి కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!
గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!