AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Manchu: మలయాళంలో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తోన్న మంచు లక్ష్మీ.. మోహన్‌లాల్‌ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటన..

Lakshmi Manchu: తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి మంచు లక్ష్మి. ఒక నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు లక్ష్మి. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ నటించి..

Lakshmi Manchu: మలయాళంలో గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తోన్న మంచు లక్ష్మీ.. మోహన్‌లాల్‌ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటన..
Manchu Lakshmi
Narender Vaitla
|

Updated on: Nov 15, 2021 | 1:22 PM

Share

Lakshmi Manchu: తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి మంచు లక్ష్మి. ఒక నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు లక్ష్మి. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని లక్ష్మీ మంచు.. అధికారికంగా తానే ప్రకటించారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్‌లాల్‌ లక్కీ సింగ్ అనే పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం లక్ష్మి ఇందులో మోహన్‌ లాల్‌కు భార్యగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే పాత్ర ఏంటన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మాన్‌స్టార్‌ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను పోస్ట్‌ చేసిన లక్ష్మి.. ‘ఎట్టకేలకు క్యాట్‌ బయటకు వచ్చేసింది. కొత్త భాష, కొత్త జానర్‌.. సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో మలయాళంలో నటిస్తోన్న నా తొలి చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఈ సినిమాలో నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్న సమయం ఎప్పటికీ మరిచిపోలేనిది’ అంటూ రాసుకొచ్చారు. మరి ఈ సినిమాతో మంచు లక్ష్మి కెరీర్‌ ఎలాంటి మలుపు తిగురుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీ నుంచి మలయాళంలో తొలిసారి నటిస్తోన్న నటిగా కూడా లక్ష్మి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లక్ష్మి చివరిగా తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘పిట్ట కథలు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే.

Also Read: Babasaheb Purandare: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత..

Railway Stations: ప్రపంచంలోనే అత్యాధునికంగా.. ఎయిర్‌పోర్టుల్లాంటి భారతీయ రైల్వే స్టేషన్లు.. వీటి గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు!

పెనుగొండ మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌ – పార్థసారథి పరస్పరం తిట్ల దండకం