Suriya Jai Bheem: వివాదంలో సూర్య జై భీమ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతున్న వన్నియార్ సంగం..
Suriya Jai Bheem: ఓ వైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే.. మరో వైపు తమిళనాడులో జై భీం సినిమాపై..
Suriya Jai Bheem: ఓ వైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే.. మరో వైపు తమిళనాడులో జై భీం సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. జై భీం సినిమాలో పై వన్నియర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. మరోవైపు సూర్య సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర వెళ్లి… పీఎంకే నేతల నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై భీం సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణ చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసింది
ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంతి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం లేదని.. వివరణ ఇచ్చారు.
అయితే జై భీం సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని పీఎంకే పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వివాదంలో నటుడు సూర్య కి మద్దుతుగా దళిత పార్టీలు, సంఘాల సహా అనేక మంది నిలుస్తున్నారు. ఇప్పటికే సూర్య వామపక్షాలకు లేఖ రాశాడు. నిజఘటనలో బాధితురాలుగా ఉన్న పార్వతి అమ్మాన్ పేరు మీద రూ. 10 లక్షలు బ్యాంకు లో వేసినట్టు చెప్పారు. అంతేకాదు దళితులకు ఎన్నో సందర్భాలలో బాసట గా నిలిచిన వామపక్షాల నేతలంటే తనకెంతో గౌరవమని , వారి సిద్ధాంతాలను ఎప్పటికి గౌరవిస్తానని సూర్య లేఖలో పేర్కొన్నాడు.
Also Read: టాలెంట్‌ఏ ఒక్కరి సొంతం కాదు.. ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు బాహుబలి భామ ఫిదా.. వీడియో వైరల్..