Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో చరిత్ర సృష్టించిన సబ్ ఇన్‏స్పెక్టర్.. తొలి విజేత ఎవరంటే..

వినోదంతోపాటు.. విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది ఎవరు మీలో కోటీశ్వరులు.. షోలో పాల్గోన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. టీవీ చూస్తున్న

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో చరిత్ర సృష్టించిన సబ్ ఇన్‏స్పెక్టర్.. తొలి విజేత ఎవరంటే..
Evaru Meelo Koteeswarulu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 15, 2021 | 3:36 PM

వినోదంతోపాటు.. విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది ఎవరు మీలో కోటీశ్వరులు.. షోలో పాల్గోన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. టీవీ చూస్తున్న ప్రేక్షకులకు సైతం ఆలోచనలో పడే విధంగా ప్రశ్నలు సందిస్తూ.. వినోదాన్ని పంచుతుంది. గతంలో ఈ షోకు నాగార్జున హోస్ట్‏గా మా టీవీలో ప్రసారమైన సంగతి తెలిసిందే. తాజాగా జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ షోలో కంటెస్టెంట్స్.. హాట్ సీట్లో కూర్చొని వారి అనుభవాల్ని, వారి లక్ష్యాలను NTRతో పంచుకుంటూ… ఉత్కంఠభరితంగా ఆడుతూ ఎన్టీఆర్ వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటి దాటుకుంటూ లక్షల కొద్ది రూపాయాలు గెలుచుకోన్నారు.

అయితే ఈ షోలో అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్‏గా సరికొత్త రికార్డును సృష్టించారు 33 ఏళ్ళ బి రాజా రవీంద్ర. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం. ఆయన పోలీస్ శాఖలో సబ్ ఇన్‏స్పెక్టర్‏గా విధులు నిర్వహిస్తున్న రాజా రవీంద్ర క్రీడా రంగంలో కూడా దిట్ట. గన్ షూటింగ్‏లో జాతీయ అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీలలో పాల్గొని ఎన్నో పథకాలను సాధించారు. ఎప్పటికైనా ఒలింపిక్స్‏లో పాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్‏లో మెడల్ సాధించాలని రాజా రవీంద్ర లక్ష్యం, అది నెరవేరడం కోసం గెలుచుకున్న కోటి రూపాయల నగదు ఉపయోగిస్తానని అయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

“ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో వ్యాఖ్యాత ఎన్టీఆర్ చెప్పినట్లుగా “ఆట నాది కోటి మీది” కొటేషన్ అక్షర సత్యం చేస్తూ కంటెస్టెంట్ బి. రాజా రవీంద్ర తన కలను నిజం చేసుకొని తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇంత పెద్ద మొత్తం ఇప్పటిదాకా ఏ తెలుగు ఛానల్‏లోనూ ఏ కంటెస్టెంట్ గానీ, ఏ సెలబ్రిటీ గానీ గెలుచుకోలేదు. మొట్టమొదటిగా విజేత రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారు.

Also Read: Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్‏లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..

Samantha: వరుస ఆఫర్లలతో సమంత బిజీ బిజీ.. రాజమౌళి సినిమాలో హీరోయిన్‏గా సామ్ ?..