Samantha: మయోసైటిస్తో పోరాడిన రోజులు గుర్తుచేసుకున్న సమంత.. ఇప్పుడు సామ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అియన తొలిరోజుల్లోనే చాలా బలహీనంగా అనిపించేందని... ఓపిక ఉండేది కాదని.. ఎన్నో మందులు తీసుకోవాల్సి వచ్చేదని అన్నారు. యశోద చిత్రానికి అతి కష్టాంగానే ఇంటర్వ్యూల్లో పాల్గొన్నానని అన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో కనిపించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. ప్రస్తుతం తాను మయోసైటిస్ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అియన తొలిరోజుల్లోనే చాలా బలహీనంగా అనిపించేందని… ఓపిక ఉండేది కాదని.. ఎన్నో మందులు తీసుకోవాల్సి వచ్చేదని అన్నారు. యశోద చిత్రానికి అతి కష్టాంగానే ఇంటర్వ్యూల్లో పాల్గొన్నానని అన్నారు.
“మయోసైటిస్ నిర్ధారణ అయిన తొలి రోజుల్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యంగా చాలా వీక్ అయ్యింది. అలాగే ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఎన్నో మందులు తీసుకోవాల్సి వచ్చింది. సినిమా నా భుజాలపై ఉండడంతో బాధ్యతగా భావించే అతి కష్టంగానే ఒక ఇంటర్వ్యూ అయినా చేయాలనుకున్నాను. ఆ తర్వాత క్రమంలో నా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ఇప్పుడు శాకుంతలం సినిమా కోసం ఆరోగ్యం సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుంటూ ధైర్యంగై ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది సామ్.
అలాగే డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం కథ చెప్పగానే సున్నితంగా తిరస్కరించానని.. అందుకు కారణం తన మనసులో మూడేళ్లుగా భయమే అని అన్నారు సామ్. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత శాకుంతలం కథ విన్నానని.. కానీ గుణశేఖర్ ఒప్పించి ఈ చిత్రంలో చేయించారని వివరించారు. ఇందులోని పాత్ర ఆహార్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తన వ్యాయమాలు, వర్కవుట్స్, డైట్ కూడా మార్చుకున్నట్లు తెలిపారు సామ్. శాకుతలం చిత్రాన్ని వదలుకుంటే తన కలను సాకారమయి ఉండేది కాదన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.