The Kashmir Files: మరో వివాదంలో కశ్మీర్‌ ఫైల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఇఫీ జ్యూరీ

ఇది ప్రచారానికి మాత్రమే పనికి వచ్చే చిత్రమని, వల్గర్‌గా ఉందని ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ముగింపు వేడుకల్లో నాదవ్ లాపిడ్ పెదవి విరిచారు

The Kashmir Files: మరో వివాదంలో కశ్మీర్‌ ఫైల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఇఫీ జ్యూరీ
Kashmir Files
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2022 | 11:34 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా జ్యూరీ హెడ్‌ నాదవ్‌ లాపిడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రచారానికి మాత్రమే పనికి వచ్చే చిత్రమని, వల్గర్‌గా ఉందని ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ముగింపు వేడుకల్లో నాదవ్ లాపిడ్ పెదవి విరిచారు. ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవాల్లో ఇలాంటి సినిమాను ప్రదర్శిస్తుండడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్‌ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు.

కళాత్మక, కాంపిటీటివ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాంటి మూవీని ప్రదర్శించడంతో తనతో బాటు అనేకమంది షాక్ అయ్యారన్నారు. దీన్ని ఎంపిక చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. భారతీయ చలన చిత్రోత్సవాల పనోరమా సెక్షన్ లో ఈ చిత్రాన్ని నవంబర్ 22న ప్రదర్శించారు. అయితే ఇజ్రాయెల్ కే చెందిన కాన్సల్ జనరల్ కొబ్బి షొషానీ.. ఆయన వ్యాఖ్యలతో విభేదించారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తాను చూశానని, ఇందులో వల్గారిటీ ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. ఇదిలావుంటే, 1990ల్లో కశ్మీర్‌ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, భారీ వలసలు నేపథ్యంలో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు