Chandra Mohan: సీనియర్ హీరో చంద్రమోహన్ కూతుళ్లు అందంగా ఉన్నా సినిమాలోకి రాకపోవడానికి కారణం అదే..!!
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు కానీ వీరితో సరి సమానంగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన మరో హీరో ఉన్నారు. ఆయనే చంద్రమోహన్. చంద్రమోహన్ సినిమాలకు అప్పట్లో భలే క్రేజ్ ఉండేది.
సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవే లేదు.. చాలా మంది నటీ నటులు తమ వారసులను సినిమా ఇండస్ట్రీలోకి దింపారు. అలనాటి సినిమాతారల వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతున్నారు. అయితే అప్పటి హీరోల మధ్య చాలా పోటీ ఉండేది. పోటా పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే వారు. ఆ తరం హీరోలు అంటే మనకు గుర్తొచ్చేది.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు కానీ వీరితో సరి సమానంగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన మరో హీరో ఉన్నారు. ఆయనే చంద్రమోహన్. చంద్రమోహన్ సినిమాలకు అప్పట్లో భలే క్రేజ్ ఉండేది. ఆయన నటనలోని వైవిద్యం ప్రేక్షకులను మెప్పించేది. చాలా సినిమాల్లో హీరోగా నటించిన చంద్రమోహన్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. పలు సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించి మెప్పించారు. దాదాపు 175 సినిమాల్లో హీరోగా నటించారు. చంద్రమోహన్.
మొత్తంగా 900లకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వయో భారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రమోహన్ ఫ్యామిలీ నుండి మాత్రం ఎవరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఒక్కరు కూడా సినిమాల్లోకి రాలేదు.
తనకు ఇద్దరు కూతురులు ఉన్నారని తెలిపారు చంద్రమోహన్. ఇద్దరమ్మాయిలు చూడటానికి చక్కగా అందంగా ఉంటారని తెలిపారు. అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటారని అన్నారు. వాళ్లను చిన్నప్పుడు చూసిన నటి భానుమతి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయం చేద్దామని అడిగారని చెప్పారు. కానీ తాను దానిని సున్నితంగా తిరస్కరించానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు. వాళ్లకు సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళతావ్ అని అడుగుతారని భయం వేసేదని.. సినిమాల ప్రభావం వారిపై పడకుండా పెంచాలని అనుకున్నానని.. ఇద్దరూ చదువుల్లో రానించారని గోల్డ్ మెడలిస్ట్ లు అని ఆనందం వ్యక్తం చేశారు చంద్రమోహన్.