Bindaas: బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఈ అమ్మడు ఇప్పడు ఎలా ఉందంటే..
అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అసలు ఇప్పుడు ఆముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు.. ? ఎక్కడఉన్నారు.? ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు.
చాలా మంది సినిమా తారలు ఒకటి అర సినిమాల్లో కనిపించి మాయమైపోతుంటారు. అరెరె ఈ అమ్మడు బాగుందే అనుకునేలోగా మరో సినిమాలో కనిపించరు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అసలు ఇప్పుడు ఆముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు.. ? ఎక్కడఉన్నారు.? ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ను కనిపెట్టారు ప్రేక్షకులు. తాజాగా బిందాస్ మూవీ హీరోయిన్ గురించి వెతుకుతున్నారు కొందరు. మంచు మనోజ్ నటించిన బిందాస్ సినిమా గుర్తుందా..? మనోజ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లో ఈ మూవీ ఒకటి. మంచి కంటెంట్ తో పాటు కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో మనోజ్ కు జంటగా నటించిన హీరోయిన్ పేరు షీనా షహబాది. చూడటానికి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ వయ్యారి భామ అందం, అభినయంతో ఆకట్టుకుంది.
ఈ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ చిన్నది ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చేక్కేసింది. చూడటానికి క్యూట్ గ ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంతా ఆరా తీస్తున్నారు. . హిందీలో చాలా సినిమాలే చేసింది. కానీ తెలుగులో మనోజ్ సినిమా తర్వాత.. యాక్షన్ త్రీడీ, నందీశ్వరుడు, నువ్వే నాబంగారం, గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాల్లో నటించింది. 2015 వరకు సినిమాల్లో నటించిన షీనా ఆ తర్వాత రెండు టీవీ సిరీస్ లలో నటించింది.
ఇక పెళ్లితర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరగని అందంతో ఇప్పటికే అంతే ముద్దుగా ఉంది ఈ భామ.