AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasari Kiran: ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్.. కారణమిదే

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిలీజైన వ్యూహం సినిమాతో నిర్మాత దాసరి కిరణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా మార్మోగిపోయింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించిన ఆయన ఎక్కువగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తోనే కలిసి సినిమాలు నిర్మించారు.

Dasari Kiran: 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్.. కారణమిదే
Tollywood Producer Dasari Kiran
Basha Shek
|

Updated on: Aug 20, 2025 | 8:36 PM

Share

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్ అయ్యారు. బుధవారం (ఆగస్టు 20) ఏపీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని అనంతరం విజయ వాడకు తరలించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉంటున్న దాసరి కిరణ్‌ బంధువు గాజుల మహేశ్‌ ఒక ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద నుంచి కిరణ్‌ రూ.4.5కోట్లు అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేశ్‌ అనేక సార్లు అడిగినా కిరణ్ పట్టించుకోలేదు. ఈనెల 18న విజయవాడలోని కిరణ్‌ కార్యాలయానికి మహేశ్‌, ఆయన సతీమణి వెళ్లారు. అయితే అక్కడ కిరణ్‌ అనుచరులు దాదాపు 15 మంది మహేష్ దంపతులపై దాడి చేశారు. దీంతో దాసరి కిరణ్ పై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహేశ్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాసరి కిరణ్ ను హైదరాబాదులో అరెస్టు చేసి విజయ వాడకు తరలించారు.

ఆర్జీవీతోనే ఎక్కువగా సినిమాలు..

దాసరి కిరణ్ విషయానికి వస్తే.. గతంలో ఆయన తెనాలి మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.  ఆ తర్వా త  రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి పలు తెలుగు చిత్రాలను నిర్మించారు. తన కెరీర్ లో ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోనే సినిమాలు నిర్మించారు కిరణ్ కుమార్. వంగవీటితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన హవీష్ హీరోగా వచ్చిన ‘జీనియస్’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే మొగల రేకులు సీరియల్ నటుడు  ఆర్కే సాగర్ తో ‘సిద్ధార్థ్’ అనే మూవీని కూడా నిర్మించారు. ఈ క్రమంలోనే 2024లో  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి  జీవిత కథ ఆధారంగా వ్యహం సినిమాను నిర్మించారు. సంచలన దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా పలు వివాదాలు ఎదుర్కొంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉండడంతో షూటింగ్ పూర్తయ్యాక కూడా చాలా రోజుల పాటు ఈ మూవీ రిలీజ్ కాలేదు. పోలీస్ కేసులు కూడా నడిచాయి. తీరా అన్ని అవాంతరాలు దాటి థియేటర్లలో రిలీజైన వ్యూహం సినిమా ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దీనికి తోడు ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నడుస్తోంది. ఇంతలోనే దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అవ్వడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..