Ravi Kishan: 21 ఏళ్లకే దేశ సేవ కోసం.. సైన్యంలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కూతురు.. నెట్టింట ప్రశంసల వర్షం
అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రేసు గుర్రం ఒకటి. ఇందులో హీరో బన్నీకి ఎంత మంచి పేరొచ్చిందో విలన్ పాత్రకు కూడా అంతే పేరొచ్చింది. మద్దాలిశివారెడ్డిగా భోజ్‌పురి నటుడు రవికిషన్ యాక్టింగ్‌లో అదరగొట్టేశాడు. భోజ్‌పురితో పాటు హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆయన రేసుగుర్రంతోనే టాలీవుడ్‌లోకి అడుగపెట్టాడు.
అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రేసు గుర్రం ఒకటి. ఇందులో హీరో బన్నీకి ఎంత మంచి పేరొచ్చిందో విలన్ పాత్రకు కూడా అంతే పేరొచ్చింది. మద్దాలిశివారెడ్డిగా భోజ్‌పురి నటుడు రవికిషన్ యాక్టింగ్‌లో అదరగొట్టేశాడు. భోజ్‌పురితో పాటు హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆయన రేసుగుర్రంతోనే టాలీవుడ్‌లోకి అడుగపెట్టాడు. దీని తర్వాత కిక్ 2, సుప్రీం, రాధ, అబద్ధం, ఎమ్మెల్యే, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, 90 ఎంఎల్, హీరో తదితర సినిమాల్లో విలన్‌తో పాటు స్పెషల్ రోల్స్‌లోనూ సందడి చేశాడు. రవికిషన్ కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ప్రతిభను చాటుకుంటున్నారు. 2019 బీజేపీ తరఫున గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. కాగా సినిమాల్లో ఉండగానే ప్రీతిశుక్లాతో కలిసి పెళ్లిపీటలెక్కారు రవికిషన్. వారికి మొత్తం నలుగురు సంతానం. ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
ఇక తాజా విషయానికొస్తే.. రవికిషన్ కూతురు ఇషితా సైన్యంలో చేరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక అగ్నిపథ్ స్కీమ్‌లో ఇషితా చేరింది. ఈ విషయాన్ని రవికిషనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇషితా వయస్సు కేవలం 21 సంవత్సరాలే. ఈక్రమంలో అతి చిన్న వయసులోనే సరిహద్దుల్లో దేశ సేవ కోసం ఆమెపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో కూతురును ప్రోత్సహించిన రవికిషన్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
— Ravi Kishan (@ravikishann) June 27, 2023
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..