Renu Desai: రేణు దేశాయ్‌కు గాయాలు.. వేళ్ళు బాగా చితికిపోయాయి అంటూ..

తన కొడుకు అకీరానందన్ ను త్వరలోనే హీరోగా పరిచయం చేయనున్నారు రేణు. అలాగే ఆమె కూడా సినిమాలతో బిజీ కానున్నారు. ఇప్పటికే రేణు దేశాయ్ ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Renu Desai: రేణు దేశాయ్‌కు గాయాలు.. వేళ్ళు బాగా చితికిపోయాయి అంటూ..
Renu Desai
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 28, 2023 | 7:36 AM

బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు రేణు దేశాయ్.. పవర్ స్టార్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత పవన్ తో కలిసి జానీ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు పవన్ ను పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు జన్మానించారు. ఇక పవన్ తో విడిపోయిన తర్వాత ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు. సింగిల్ పేరెంట్ గా తన పిల్లలను పెంచుతున్నారు రేణు దేశాయ్. ఇక తన కొడుకు అకీరానందన్ ను త్వరలోనే హీరోగా పరిచయం చేయనున్నారు రేణు. అలాగే ఆమె కూడా సినిమాలతో బిజీ కానున్నారు. ఇప్పటికే రేణు దేశాయ్ ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చాలా కాలం తర్వాత రేణు సినిమాల్లో నటిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూఉంటారు. రీసెంట్ గా రేణు దేశాయ్ షేర్ చేసిన అకీరా నందన్ వర్కూట్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో పోస్ట్ ను షేర్ చేశారు రేణు దేశాయ్. రెండు రోజుల క్రితం తన కాలికి తీవ్రమైన గాయం తగిలిందని తెలిపారు రేణు. దానివల్ల తన కాలి మూడు వేళ్ళు చాలా దెబ్బతిన్నాయని తెలిపారు. వాటిలో వేలు చాలా చితికిపోయింది అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. దాంతో జాగ్రత్తగా ఉండండి మేడం అటు కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!