KTR: పవన్‌ కల్యాణ్‌ మంచి ఫ్రెండ్‌.. నాకు అన్నలాంటోడు.. మా అభిరుచులు ఒకటే.. టీవీ9 ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌

జనసేన అధ్యక్షులు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ' నాకు పవన్‌ కల్యాణ్ మంచి ఫ్రెండ్. ఒక అన్న లాంటి వాడు. చాలా సార్లు కలుసుకున్నాం. పలు విషయాలు మాట్లాడుకున్నాం. చాలా విషయాల్లో మా అభిరుచులు కలుస్తాయి...

KTR: పవన్‌ కల్యాణ్‌ మంచి ఫ్రెండ్‌.. నాకు అన్నలాంటోడు.. మా అభిరుచులు ఒకటే.. టీవీ9 ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌
Ktr, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jun 28, 2023 | 9:05 AM

జనసేన అధ్యక్షులు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ నాకు పవన్‌ కల్యాణ్ మంచి ఫ్రెండ్. ఒక అన్న లాంటి వాడు. చాలా సార్లు కలుసుకున్నాం. పలు విషయాలు మాట్లాడుకున్నాం. చాలా విషయాల్లో మా అభిరుచులు కలుస్తాయి. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం. నాకు కూడా కొంచెం ఇష్టం. అయితే రాజకీయాలు, స్నేహానికి సంబంధం లేదు. ఎవరి రాజకీయాలు వారివి. ఆయన రాజకీయాలు ఆయనివి. నా రాజకీయాలు నావి. ఏపీలో నారా లోకేష్‌ కూడా నాకు బాగా తెలుసు. జగనన్న మంచి ఫ్రెండ్‌. నాకు అందరూ స్నేహితులే. నాకెవరితోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏపీలోనూ తమ పార్టీ పోటీచేస్తుందన్నారు కేటీఆర్‌. ‘అసెంబ్లీ సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్‌ విషయానికొచ్చేసరికి ఏపీలో అన్ని పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకించే గొంతు బీఆర్‌ఎస్‌ మాత్రమే. సీఎం కేసీఆర్‌ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను కాపాడగలరని ప్రజలు అనుకుంటే ఏమైనా జరగొచ్చు. మా పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందాక కేంద్రంలో ఓ కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాం.’

‘బీజేపీని ఓడించే పార్టీ బీఆర్‌ఎస్‌ ఒక్కటే. ప్రధాని మోడీ ముక్కుపిండైనా సరే తమ హక్కులు సాధించగలిగే నాయకులు కేసీఆర్‌ ఒక్కరే అని ఏపీ ప్రజలు భావిస్తే ఏదైనా జరగొచ్చు. అసెంబ్లీ ఎన్నికలా? పార్లమెంట్‌ ఎన్నికలా? అన్న సంగతి పక్కన పెడితే కేసీఆర్‌ లాంటి ఫైటర్‌ను ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారు. ఎందుకంటే కుమ్మక్కు రాజకీయాలు, లాలూచీ రాజకీయాలు మాకు చేతకావు. బతికినన్ని రోజులు కొట్లాడుతూనే ఉంటాం. అది మోడీ అయినా.. మరెవరైనా. భయపడే ప్రసక్తే లేదు. లొంగిపోయే ప్రసక్తే లేదు. లాలూచీ పడేదే లేదు’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..