Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో పెళ్లి.. మొదటిసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొన్నాళ్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే ఛావా, కుబేర, థామా సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెడ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. నవంబర్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రచారాల్లో పాల్గొంటుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే కుబేర, థామా, ఛావా సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న రష్మిక.. తన అప్ కమింగ్ సినిమాలతోపాటు పర్సనల్ విషయాలపై సైతం ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండతో తన పెళ్లి గురించి మొదటిసారి స్పందించింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో సందడి చేసింది రష్మిక. విజయ్ తో నిశ్చితార్థం తర్వాత మొదటిసారి మీడియ ముందుకు వచ్చింది రష్మిక. ఇక ముందు నుంచి అనుకున్నట్లుగానే ఎంగేజ్మెంట్ పై ప్రశ్నించారు యాంకర్.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
ముందుగా యాంకర్.. ఒక వ్యక్తిని బాయ్ ఫ్రెండ్ గా ఎంచుకోవాలని ఎలా జడ్జ్ చేయాలని అడగ్గా.. అందుకు అడియన్స్ నుంచి విజయ్ దేవరకొండని అడిగితే చెప్తారని కామెంట్ వచ్చింది. అందుకు రష్మిక నవ్వుతూ సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుందని యాంకర్ మరో ప్రశ్న వేయగా.. అక్కడే ఉన్న జనాలు రౌడీ (విజయ్ దేవరకొండ) లాంటి వ్యక్తి అనే ఆన్సర్ వచ్చింది. దీంతో రష్మిక చిరునవ్వుతూ.. అందరికీ తెలుసు.. అంతే అంతే అనుకుంటూ చేయి ఊపుతూ కనిపించింది. దీంతో విజయ్ దేవరకొండతో రష్మిక నిశ్చితార్థం గురించి చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 3న వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని టాక్ బయటకు వచ్చింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందని సమాచారం. ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్, రష్మిక ఇద్దరూ స్పందించలేదు. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ వేడుకలో మొదటిసారి పరొక్షంగా తన పెళ్లి గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?




