AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: 16 ఏళ్లకే క్యాస్టింగ్ కౌచ్.. ఆపై బీ-గ్రేడ్ సినిమాలు.. ఈ టాప్ హీరోయిన్ ఎవరంటే.?

ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. అంతేకాదు అవమానాలు కూడా భరించింది. 16 ఏళ్లకే క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. ఇప్పుడు మంచి నటిగా గుర్తింపు సంపాదించింది. మరి ఆ హీరోయిన్ ఎవరంటే.. ఓ సారి చూసేద్దాం. లుక్కేయండి.

Actress: 16 ఏళ్లకే క్యాస్టింగ్ కౌచ్.. ఆపై బీ-గ్రేడ్ సినిమాలు.. ఈ టాప్ హీరోయిన్ ఎవరంటే.?
Trending
Ravi Kiran
|

Updated on: Aug 08, 2025 | 1:16 PM

Share

అవమానాలు, ఇబ్బందులు, క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీ హీరోయిన్ వీటిని కచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసి ఉంటారు. అలాగే ఈ నటి కూడా తన పర్సనల్ అండ్ ప్రోఫెషనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కుంది. ఈ ఫేమస్ టీవీ నటి తన జీవితంలో ఎదుర్కున్న చీకటి రోజులను గుర్తుచేసుకుని.. ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన రష్మి దేశాయ్ తన పర్సనల్ లైఫ్‌లోని చీకటి రోజులు ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఒకప్పుడు తాను ఉండటానికి ఇల్లు లేదని.. తన కారులోనే నాలుగు రోజులు గడిపినట్లు చెప్పింది. ‘నేను ఒక ఇల్లు కొని రూ.2.5 కోట్ల లోన్ తీసుకున్నా. మొత్తం అప్పు 3.5 కోట్ల వరకు పెరిగింది. అంతా బాగున్నప్పుడు, ఈఎంఐలు కుడుతుండగా.. నేను చేస్తున్న షో ఆగిపోయింది. దీంతో నా పరిస్థితి ఎటూ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది’ అని రష్మి చెప్పింది.

షో ఆగిపోవడంతో వెంటనే తనను ఇల్లు ఖాళీ చేయమన్నారని.. ఫ్యామిలీకి ఈ విషయం చెప్పడం ఇష్టంలేక లగేజి మేనేజర్ ఇంట్లో పెట్టేశానని చెప్పింది. నాలుగు రోజుల పాటు తన కారులోనే ఒంటరిగా జీవించానని పేర్కొంది. అలాగే 16 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నానని రష్మి తెలిపింది. ’16 ఏళ్లప్పుడు ఓ అడిషన్‌కు వెళ్తే.. అక్కడ నాకు మత్తు మందు ఇవ్వడానికి ట్రై చేశారు. ఎలాగోలా తప్పించుకుని వచ్చా.’ అని రష్మి ఇంటర్వ్యూలో చెప్పింది. ఆపై కొన్ని B గ్రేడ్ సినిమాల్లో కూడా నటించానంది. అయితే తనకు టీవీ సీరియల్స్ ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాను అప్పులన్నీ తీర్చేశానని.. కానీ ఆ స్టేజికి రావడానికి నాకు ఎక్కువ సమయం పట్టిందని రష్మి దేశాయ్ తెలిపింది. ఒకానొక సందర్భంలో ఏంటి ఈ జీవితం.. ఇలా టెన్షన్ పడుతూ బ్రతికే బదులు చనిపోవడం బెటర్ అని చాలా సార్లు అనుకున్నానని చెప్పింది ఈ సీరియల్ బ్యూటీ.

ఇది చదవండి: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..