AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?

అటు పక్కన ఉన్నది ఇండస్ట్రీలో స్టార్ హీరో.. అతడికి సరసన ఓ యంగ్ హీరోయిన్ నటించింది. సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ ఉండగా.. దానికి తెగేసి మరీ వద్దని చెప్పేసింది హీరోయిన్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..

Tollywood: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?
Tollywood
Ravi Kiran
|

Updated on: Aug 05, 2025 | 8:37 AM

Share

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తన నటన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలకు వార్తల్లో నిలిచిన సందర్భాలు లేకపోలేదు. 70, 80వ దశకాల్లో రిషి కపూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించాయి. రొమాంటిక్ సీన్స్‌కి రిషి కపూర్ కింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రిషి కపూర్ రొమాంటిక్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాగా.. ఇందులో ఓ సీన్‌తో రిషి కపూర్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. ఈ చిత్రంలో మరాఠీ నటి రిషి కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముద్దు సీన్స్‌కు ఆమె తెగేసి మరీ వద్దని చెప్పేసింది. ఆ చిత్రం మరేదో కాదు ‘ప్రేమ్ రోగ్’. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్‌కి గుర్తిండిపోతాయ్. ప్రేమ్ రోగ్ చిత్రాన్ని రిషి కపూర్ తండ్రి రాజ్ కపూర్ నిర్మించారు. ఇది బ్లాక్ బస్టర్ కాగా.. ఈ చిత్రంలో మరాఠీ నటి పద్మిని కొల్హాపురే.. రిషి కపూర్‌తో కలిసి నటించింది. ఆమె పాత్రను ప్రేక్షకులు నుంచి ప్రశంసలు దక్కాయి.

‘నేను అలాంటిదేమీ చేయను..’

ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సన్నివేశం ఉండగా.. హీరోయిన్ పద్మిని తెగేసి మరీ అది చేయనని చెప్పేసింది. ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో పద్మిని కొల్హాపురే దీని గురించి మాట్లాడింది. ‘ఇదంతా చేయడం నాకు అంత సులభం కాదు. సినిమాలో ఒక ముద్దు సన్నివేశం ఉంది. కానీ నేను స్పష్టంగా చేయనని చెప్పేశాను.’ అంతే కాదు ఈ సినిమాలో రిషి కపూర్ పద్మిని చెంప మీద కొట్టాలి. సీన్ పర్ఫెక్ట్‌గా రావడానికి 8 రీటేకులు తీసుకున్నారు.

ఆ సినిమాలో పద్మిని నటనకు ఫ్యాన్స్ ఫిదా..

ప్రేమ్ రోగ్‌‌లో పద్మిని నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. 17 ఏళ్ల వయస్సులోనే ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. దర్శకుడు రాజ్ కపూర్ ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా.. ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులు అందుకున్నారు.

ఇది చదవండి: ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది