AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: చిక్కుల్లో జానీ మాస్టర్.. రేప్ కేసు పెట్టిన జూనియర్ డ్యాన్సర్

ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు

Jani Master: చిక్కుల్లో జానీ మాస్టర్.. రేప్ కేసు పెట్టిన జూనియర్ డ్యాన్సర్
Jani Master
Basha Shek
| Edited By: |

Updated on: Sep 19, 2024 | 4:13 PM

Share

ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై  సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లోని స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ అయిన ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు చోట్ల విస్తృత ప్రచారం నిర్వహించారు.

జానీ మాస్టర్‌పై గతంలోనూ ఓ కేసు ఉంది.. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్‌ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తాజాగా మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు మేరకు జానీమాస్టర్‌పై కేసు బుక్కయింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సంలచన ఆరోపణలపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో ఇదిగో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.