Allu Arjun: అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి.. ఐకాన్ స్టార్ రియాక్షన్ ఏంటో తెలుసా?
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు అల్లు అర్జున్. తన సినిమా అప్‌డేట్స్‌తోపాటు పలు ఆసక్తికర విశేషాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు బన్నీ. తనకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి సర్‌ప్రైజ్ గిప్ట్ వచ్చిందని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ గిప్ట్ ఏంటంటే.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు అల్లు అర్జున్. తన సినిమా అప్‌డేట్స్‌తోపాటు పలు ఆసక్తికర విశేషాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు బన్నీ. తనకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి సర్‌ప్రైజ్ గిప్ట్ వచ్చిందని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ గిప్ట్ ఏంటంటే.. ‘గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. అతని నిజాయితీ, నాపై చూపించిన చొరవతో నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది నాకెంతో ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్’ అని బన్నీ రాసుకొచ్చాడు. అజ్ఞాత వ్యక్తి తనకు Burned Beneath the Fire of Desire అనే పుస్తకాన్ని పంపించినట్లు అల్లు అర్జున్ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ కోసం తన సమయాన్నంతా కేటాయిస్తున్నాడు.. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి చెప్పిన తేదీ కల్లా సినిమాను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 ది రైజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మొదటి పార్ట్ కు మించి ఉండేలా పుష్ప 2ను గత మూడేళ్లుగా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు15నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో డిసెంబర్ 6 కు వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
అల్లు అర్జున్ అందుకున్న గిఫ్ట్ ఇదే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.