AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ..! స్టార్ హీరో సినిమా సెట్‌లో 120మందికి ఫుడ్ పాయిజన్..

సినిమా సెట్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా 120మందికి అనారోగ్యం.. సినిమా సిబ్బందికి కడుపు నొప్పి, వాంతులు, వికారం, తలనొప్పి వంటి లక్షణాలతో హాస్పటల్‌లో చేరారు. 600మంది షూటింగ్ లో పాల్గొంటే 120మంది అస్వస్థతకు గురయ్యారు. దాంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ..! స్టార్ హీరో సినిమా సెట్‌లో 120మందికి ఫుడ్ పాయిజన్..
Movie News
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2025 | 3:56 PM

Share

సినిమా షూటింగ్స్ లో అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యాక్షన్ సీన్స్ షూట్స్ జరిగేటప్పుడు. లేదా ఏదైనా ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ స్టార్ హీరో సినిమా సెట్ లో ఊహించని సంఘట జరిగింది. దాంతో ఏకంగా 120మందికి పైగా హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. దాంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఒకే సారి 120కి పైగా హాస్పటల్ లో చేరడం తో గందరగోళం నెలకొంది. ఇంతకూ ఆ సినిమా ఏది.? ఆ స్టార్ హీరో ఎవరు.? అసలు ఏమైందో చూసేద్దాం.!

ఇదెక్కడి ఏ సర్టిఫికెట్ సినిమారా బాబు..! టాలీవుడ్‌లో ఇలాంటి బోల్డ్ మూవీ ఉందా.!!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం రణవీర్ సింగ్ ధురంధర్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ లడక్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో చిత్రయూనిట్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత సుమారు 120మంది మూవీ టీమ్ అనారోగ్యానికి గురయ్యారు.

Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర

వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ శాంపిల్స్ ను ప్రస్తుతం లాబ్ కు పంపించి టెస్ట్ చేస్తున్నారు. ఈ సంఘటన బాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది. సినిమా షెడ్యూల్ కోసం హాజరైన 600 మంది సిబ్బందిలో, దాదాపు 120 మంది అస్వస్థతకు గురై ప్రస్తుతం SNM ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదిత్య ధార్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.