AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో క్రేజీ హీరోయిన్.. కొడుకుతో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్స్ తమ లుక్స్, ఫిట్‌నెస్ పై ఎంత జాగ్రత్తగా ఉంటారో చెప్పక్కర్లేదు. ఈమధ్యకాలంలో వయసుతో సంబంధమే లేకుండా కఠినమైన వర్కవుట్స్ చేస్తూ పాతికేళ్ల అమ్మాయిల్లా కనిపిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వర్కవుట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో క్రేజీ హీరోయిన్.

Tollywood: తెలుగులో క్రేజీ హీరోయిన్.. కొడుకుతో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..
Pranitha
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2025 | 3:19 PM

Share

సినీరంగంలో నటీనటులు తమ లుక్స్, ఫిట్నెస్ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, కమల్ హాసన్ వంటి స్టార్స్ తమ వయసుతో సంబంధమే లేకుండా శరీరాకృతి కోసం కష్టపడుతుంటారు. అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ శ్రియా, త్రిష తమ లుక్స్ విషయంలో నిత్యం జనాలను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ వర్కవుట్ వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి. ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఇవి కూడా చదవండి

తన కొడుకుతో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రణీత సుభాష్. తెలుగు, తమిళ సినీప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఏం పిల్లో ఏం పిల్లడూ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో బావ సినిమాతో అలరించింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. తెలుగు, కన్నడ, తమిళంలో పలు చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ప్రణీత.. ఆ తర్వాత సినిమాలు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రణీత.. ఇటు తల్లిగా తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన పిల్లలు, తన ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన కొడుకుతో కలిసి సరదాగా వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను