AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 Chinna Katha Kaadu: ‘స్కూల్‌లో 35 నాకు పెద్ద పర్వతం..ఇది మన అందరి కథ’: రానా దగ్గుబాటి

నంద కిశోర్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 6 న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులతో పాటు పలువురి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పిల్లలు, పేరెంట్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్ ఆదరాభిమానాలు పొందిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతోంది.

35 Chinna Katha Kaadu: 'స్కూల్‌లో 35 నాకు పెద్ద పర్వతం..ఇది మన అందరి కథ': రానా దగ్గుబాటి
Rana Daggubati
Basha Shek
|

Updated on: Oct 09, 2024 | 11:57 AM

Share

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ సినిమాను నిర్మించారు. నంద కిశోర్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 6 న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులతో పాటు పలువురి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పిల్లలు, పేరెంట్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్ ఆదరాభిమానాలు పొందిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో 35 చిన్న కథ కాదు స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 02 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. వ్యూస్ పరంగా రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఆహాలో నివేదా థామస్ సినిమా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసిందని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

సాధారణంగా స్టూడెంట్స్ లో చాలా మందికి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా భయం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనమూ కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేసిన వాళ్లమే. ఇప్పుడిదే అంశాన్ని 35 సినిమాలో చూపించారు మేకర్స్. మ్యాథ్స్ లో వెనుకపడిన విద్యార్థికి స్కూల్‍లో కంటిన్యూ కావాలంటే గణితంలో కనీసం 35 మార్కులు కోవాలని కండీషన్ పెట్టడం, కొడుకు కోసం తల్లి మ్యాథ్స్ నేర్చుకోవడం, ఆ తర్వాత కుమారుడికి కూడా నేర్పించడం.. ఇలా యూనివర్సల్ పాయింట్ తో ఈ సినిమా నడుస్తుంది. ఇప్పటివరకు క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్ ఇందులో తల్లి సరస్వతి పాత్రలో అద్భుతంగా నటించింది.

ఇవి కూడా చదవండి

ఇండియన్ ఐడల్ సింగర్లతో 35 మూవీ టీమ్..

కాగా 35 సినిమా ప్రమోషన్లలో హీరో, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘స్కూల్‌లో ఉన్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటిది. డైరెక్టర్ ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను. ఆ తర్వాత మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తుకు వచ్చింది. ఈ కథ వెళ్లి మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. చాలా మంది లైఫ్ ఇలాగే ఉంటుంది’ అని రానా దగ్గుబాటి చెప్పుకొచ్చారు.

35..  చిన్న కథ కాదు సినిమా ప్రమోషన్లలో దగ్గుబాటి రానా… వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.