Rishab Shetty: పంచె కట్టులో జాతీయ అవార్డు అందుకున్న కాంతారా హీరో.. ఫ్యాన్స్ ఫిదా.. వీడియో చూడండి
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. కాంతార సినిమాలో అద్భుత నటనకు గానూ ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. మంగళవారం ( అక్టోబర్ 08) ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నాడు రిషబ్
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. కాంతార సినిమాలో అద్భుత నటనకు గానూ ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. మంగళవారం ( అక్టోబర్ 08) ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నాడు రిషబ్. ఇక్క విశేషమేమిటంటే.. ఆయన పంచె కట్టుకుని ఈ అవార్డు వేడుకకు వెళ్లాడు. దక్షిణాది సంప్రదాయాలను మరోసారి గుర్తు చేస్తూ అవార్డుల ప్రదానోత్సవానికి రిషబ్ పంచె కట్టు తో వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. రిషబ్ శెట్టి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఎక్కువ విలువ ఇస్తాడు. అతని సినిమాల్లోనూ ఇదంతా కనిపిస్తుంటుంది. ‘కాంతారా’ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్నిసృష్టించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఈ సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
‘కాంతారా’ సినిమాతో రిషబ్ శెట్టి నేషనల్ స్టార్ అయిపోయాడు. పాన్ ఇండియా స్టార్ అయిన రిషబ్ శెట్టి ఇప్పటికే చాలా ఈవెంట్‌లకు పంచె కట్టుతోనే హాజరయ్యాడు. సాధారణంగా ఆర్టిస్టులు అవార్డు ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు సూట్లు, షూలు వేసుకునేవారు. కానీ కొందరు నటీనటులు అసలైన సంప్రదాయ దుస్తులనే ఎంచుకుంటారు. వారిలో రిషబ్ శెట్టి కూడా కూడా ఒకడు.
వీడియో ఇదిగో..
#WATCH | 70th National Film Awards | Rishab Shetty awarded the Best Actor in Leading Role for his performance in the movie ‘Kantara’
(Video source: DD News/YouTube) pic.twitter.com/YMStTzDyDz
— ANI (@ANI) October 8, 2024
2022లో ‘కాంతారా’ సినిమా తెరకెక్కింది. ‘హోంబాలే ఫిల్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి తదితరులు నటించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో జాతీయ అవార్డు గెలుచుకున్న రిషబ్ శెట్టిని అందరూ అభినందిస్తున్నారు.
President #DroupadiMurmu, Union Minister of Information & Broadcasting Ministry of Railways #AshwiniVaishnaw, present Best actor in a Leading role to #RishabShetty for Film #Kantara during the 70th #NationalFilmAwards, 2022 at #VigyanBhawan on Oct. 8, 2024 in #NewDelhi, #India. pic.twitter.com/bnF5K8NSjB
— Entertainment Feed (@EntFeed_) October 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.