- Telugu News Photo Gallery Cinema photos Hero Suriya plans 3 movies between kanguva part 1 and kanguva part 2, details here Telugu Heroes Photos
Suriya: ఇదేం స్పీడ్ సామీ.! కంగువా పార్ట్ 1 అండ్ 2 కి మధ్యలో 3 సినిమాలా.?
ఇదేం స్పీడ్ సామీ..! సూర్యను చూసిన తర్వాత అభిమానులు ఇదే అడుగుతున్నారిప్పుడు. ఓ వైపు కంగువా ఇంకా విడుదలే కాలేదు.. అప్పుడే మరో సినిమాను కూడా పూర్తి చేసారు ఈ హీరో. ఈయన జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నా.. ఒక్క విషయంలో వెనకే ఉన్నారు సూర్య. సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్ ఈయన సొంతం.
Updated on: Oct 09, 2024 | 6:22 PM

ఇదేం స్పీడ్ సామీ..! సూర్యను చూసిన తర్వాత అభిమానులు ఇదే అడుగుతున్నారిప్పుడు. ఓ వైపు కంగువా ఇంకా విడుదలే కాలేదు.. అప్పుడే మరో సినిమాను కూడా పూర్తి చేసారు ఈ హీరో.

ఈయన జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నా.. ఒక్క విషయంలో వెనకే ఉన్నారు సూర్య. సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు.

ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా ముందు ఉన్న ఒకే ఒక్క టార్గెట్ వెయ్యి కోట్లు. ఆ క్లబ్‌లో చోటు కోసమే ప్రతీ స్టార్ హీరో కష్టపడుతున్నారు. అయితే సూర్య మాత్రం అంతకు మంచి కలలు కనడం తప్పేం లేదన్నారు.

సూర్యకు సరైన హిట్ వచ్చి దశాబ్ధం దాటేసింది. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు అద్భుతాలు చేసినా.. అవి ఓటిటిలో వచ్చాయి. ప్రస్తుతం ఈయన ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

కంగువా పార్ట్ 1 నవంబర్ 14న విడుదల కానుంది. దీని రిలీజ్‌కు ముందే కార్తిక్ సుబ్బరాజ్ సినిమాను పూర్తి చేసారు సూర్య. కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అలాగే కార్తిక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్ స్టర్ డ్రామా చేస్తున్నారు సూర్య. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.

తాజాగా ఈ చిత్ర షూట్ పూర్తైంది. ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తుంది. దీని తర్వాత కమెడియన్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య.

అది పక్కా ఊరమాస్ రోల్. సో, నియర్ ఫ్యూచర్‌లో పక్కా కమర్షియల్, యాక్షన్, ఊర మాస్ రోల్స్ లో మాత్రమే కనిపించాలని ఫిక్సయిపోయారు నడిప్పిన్ నాయగన్.




