- Telugu News Photo Gallery Cinema photos Actress Vithika Sheru Latest Red Colour saree Look Photo Goes Viral
Vithika Sheru: పట్టుచీరలో వితికా అద్భుతం.. రెండు కళ్లు చాలవు..
వితికా శేరు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. అచ్చమైన తెలుగమ్మాయి. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. తెలుగులో హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలే అయినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించింది.
Updated on: Oct 09, 2024 | 4:31 PM

వితికా శేరు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. అచ్చమైన తెలుగమ్మాయి. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.

తెలుగులో హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలే అయినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించింది. నాని నటించిన భీమిలీ కబడ్డి జట్టు చిత్రంలో కనిపించింది.

యంగ్ హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వితిక.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి తన భర్తతో కలిసి అడుగుపెట్టింది.

ఇక ఆ తర్వాత వరుణ్ సందేశ్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుండగా.. వితికా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, డాన్స్ రీల్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

తాజాగా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఎర్ర రంగు పట్టుచీరలో ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం వితిక లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమె బ్యూటీఫుల్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.




