- Telugu News Photo Gallery Cinema photos Nayanthara Latest Red Saree Photos Goes Viral in Social Media
Tollywood: ఎర్ర చీరలో కట్టిపడేస్తోన్న అందం.. సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు చాలా స్పెషల్..
దక్షిణాది చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గతేడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నయనతారను ఆమె అభిమానులు తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్" అని పిలుస్తారు.
Updated on: Oct 09, 2024 | 3:36 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గతేడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

నయనతారను ఆమె అభిమానులు తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్" అని పిలుస్తారు. ఈ అమ్మడు.. చివరిసారిగా అన్నపూరణి చిత్రంలో నటించింది. విమర్శకుల ప్రశంసల తర్వాత ఈ చిత్రం గత డిసెంబర్‌లో విడుదలైంది.

తాజాగా నటి నయనతార లేటేస్ ఫోటోషూట్ నెట్టింట వైరలవుతుంది. నయన్ అసలు పేరు డయానా మరియం కురియన్. కేరళలోని తిరువల్ల అనే పట్టణంలో 1984లో జన్మించారు.కేరళలోని మార్తోమా కాలేజీలో బీఏ చేశారు

ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన ఆమె.. 2003లో మలయాళ చిత్రం "మానసికరో"లో తొలి నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నయనతార 2005లో హరి దర్శకత్వంలో నటుడు శరత్‌కుమార్‌కి జోడీగా "అయ్యా" సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

కాల్వనిన్ కడలి, వల్లవన్, విల్లు వంటి చిత్రాల్లో నటించిన నయన్.. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించే అవకాశాలు చాలానే వచ్చాయి. మహిళలకు ప్రాముఖ్యతనిస్తూ చిత్రాలలో నటించడం ప్రారంభించింది.




