ఈ దసరాకి టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా విశ్వం. గోపిచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గోపిచంద్, శ్రీనువైట్ల ఇద్దరు ఫ్లాప్స్‌లో ఉండటంతో సినిమా మీద ఆశించిన స్థాయిలో బజ్ రావటం లేదు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరో కూడా దసరా బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.