- Telugu News Photo Gallery Cinema photos Samantha Intereting Comments On Nivetha Thomas 35 Chinna Katha Kaadu Movie Now Streaming On Aha OTT
Samantha: సమంత మెచ్చిన ఫీల్ గుడ్ మూవీ.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్, నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. నంద కిషోర్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమాకు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం.
Updated on: Oct 09, 2024 | 2:54 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్, నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. నంద కిషోర్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమాకు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం.

సెప్టెంబర్ 6 న థియేటర్లలో విడుదలైన 35 చిన్న కథ కాదు సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ తో పాటు పలువురి ప్రశంసలు అందుకుంది. ఇక అక్టోబర్ 02 నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి రాగా ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

తాజాగా 35 చిన్న కథ కాదు సినిమాపై ప్రముఖ హీరోయిన్ ప్రశంసల వర్షం కురిపించింది. జిగ్రా ప్రమోషన్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె గత నెలలో ’35 చిన్న కథ కాదు’ మూవీని రానా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని, ఈ మూవీ ఎంతో బాగుందన్నారు.

'హీరోయిన్స్‌కి ఎంతో బాధ్యత ఉంటుంది. ప్రతి అమ్మాయి కథలో ఆ అమ్మాయే హీరో. రానా మంచి చిత్రాలను నిర్మిస్తుంటారు. గత నెలలో ఆయన రిలీజ్ చేసిన 35 చిన్న కథ కాదు చాలా బాగుంది' అని సామ్ చెప్పుకొచ్చింది.

రానా సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు

చదువుల విషయంలో పిల్లలకు తల్లి దండ్రుల సపోర్టు ఎంత ముఖ్యమనే యూనివర్సల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆహాలో రిలీజైన ఈ ఫీల్ గుడ్ సినిమా ఇప్పటికే 105 మిలియన్ ఫ్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోంది.



















