Alia Bhatt: సమంత రూట్‌లో అలియా.. ప్రమోషన్స్‌లో నయా ట్రెండ్
కొత్త సినిమాల అప్‌డేట్స్ లేకపోయినా... రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రాజెక్ట్స్‌ను మాత్రం పక్కా ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంలో నార్త్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు సమంత. ఈ ప్రమోషన్ ట్రెండ్ విషయంలో అలియా కూడా సమంతనే ఫాలో అవుతున్నారు. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్‌తో మాత్రంలో టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు సామ్.
Updated on: Oct 09, 2024 | 2:09 PM

ఇందులో ఓ హీరోయిన్‌గా సమంతను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే నిజమైతే స్యామ్‌కి ఇంతకంటే బెస్ట్ కమ్ బ్యాక్ ఉండదు. బన్నీతోనూ సన్నాఫ్ సత్యమూర్తితో పాటు పుష్పలో ఓ స్పెషల్ సాంగ్ చేసారు సమంత.

సినిమాలు చేయకపోయినా ఆడియన్స్‌తో మాత్రంలో టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు సామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటున్నారు. వరుసగా ఫొటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేస్తున్నారు. అదే సమయంలో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ను పక్కాగా ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఖుషి రిలీజ్ తరువాత ఇంత వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు సామ్. సిటాడెల్ ఇండియన్ వర్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఈ షో ప్రమోషన్ కోసం నార్త్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. రీసెంట్‌గా సిటాడెల్ ప్రీమియర్ ఫారిన్‌లో జరిగింది.

ఈ ఈవెంట్‌కు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా రావటంతో ఇంటర్నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు అలియా భట్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న జిగ్రా సినిమా ప్రమోషన్ కోసం తెలుగు స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు.

ఆల్రెడీ దేవర రిలీజ్ టైమ్‌లోనే జిగ్రాను తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేసిన అలియా భట్, ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత హెల్ప్ తీసుకుంటున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సమంత గెస్ట్‌గా హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది.




