- Telugu News Photo Gallery Cinema photos S.S.Rajamouli & Mahesh Babu ssmb29 Movie Update on 09 10 2024
Mahesh Babu: మహేషా మజాకా.. గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్స్
నెక్ట్స్ మూవీ గురించి జక్కన్న ఇంత వరకు ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. మహేష్‌తో మూవీ అన్న క్లారిటీ ఉన్నా... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలా ఉండబోతోంది.? ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. అయినా సరే మహేష్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు? సోషల్ మీడయా ట్రెండ్స్‌లో గ్లోబల్ రేంజ్‌లో సత్తా చాటుతున్నారు.
Updated on: Oct 09, 2024 | 2:03 PM

నెక్ట్స్ మూవీ గురించి జక్కన్న ఇంత వరకు ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. మహేష్‌తో మూవీ అన్న క్లారిటీ ఉన్నా... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలా ఉండబోతోంది.? ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. అయినా సరే మహేష్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు? సోషల్ మీడయా ట్రెండ్స్‌లో గ్లోబల్ రేంజ్‌లో సత్తా చాటుతున్నారు.

ప్రజెంట్ ఈ డైలాగ్‌నే రిపీట్ మోడ్‌లో వింటున్నారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ ఎప్పుడు కెమెరా కంట పడ్డా లుక్ గురించే డిస్కషన్ జరుగుతోంది. చాలా రోజులుగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్‌తో కనిపిస్తుండటంతో మహేష్ ఇంకెన్నాళ్లు మేకోవర్ అవుతారన్న చర్చ జరుగుతోంది.

మహేష్, రాజామౌళి కాంబోలో తెరకెక్కబోయే సినిమా గ్లోబల్ మూవీ అన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే రాజమౌళి ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ ఇవ్వకపోయినా... కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం హింట్స్ ఇచ్చారు. ఆఫ్రికన్ ఫారెస్ట్‌లో యాక్షన్ డ్రామాగా సినిమాను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

ప్రజెంట్ మహేష్ లుక్ చూస్తే విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చిన కథకు పర్ఫెక్ట్ కటౌట్‌లా కనిపిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ హీరోలా స్టైలిష్‌గా కనిపిస్తూనే రఫ్ అండ్ టఫ్ అనిపించేలా ఉన్నారు మహేష్. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ లైన్‌కు ప్రజెంట్ మహేష్ లుక్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.

ఇదే జరిగితే జక్కన్నకు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోతుంది. ఇక SSMB29తో మహేష్ బాబు రేంజ్ కూడా ఊహకందదేమో..?