- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's OG Movie Shooting latest Updates on 09 10 2024
Pawan Kalyan: స్పీడు పెంచిన పవన్… పట్టాలెక్కనున్న ఓజీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ బిజీ కారణంగా సినిమాలను పక్కన పెట్టేసిన పవర్ స్టార్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే సినిమా షూటింగ్‌లు కూడా చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు పవర్ స్టార్. ఆల్రెడీ ఓ సినిమా స్టార్ట్ చేసిన పవన్, ఇప్పుడు రెండు సినిమాను కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు.
Updated on: Oct 09, 2024 | 1:57 PM

లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు పవర్ స్టార్. చాలా రోజలుగా వాయిదా పడుతున్న హరి హర వీరపమల్లు షూటింగ్‌ను రీస్టార్ట్ చేశారు. అందుకోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్‌ను రూపొందించారు. ప్రజెంట్ ఆ సెట్‌లోనే హరి హర వీరమల్లు షూటింగ్ జరుగుతోంది.

పవన్ తిరిగి సెట్‌లో అడుగుపెట్టడంతో మిగతా సినిమాల విషయంలోనూ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ క్రైమ్ డ్రామా ఓజీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన సుజిత్, ఈ నెల 14 నుంచి సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ ఆల్రెడీ పూర్తయ్యింది. మిగిలిన కొంత ఈ నెలలో ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కొత్త షెడ్యూల్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

పవన్ కిట్టీలో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా పవన్ కమిట్‌మెంట్స్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు పవన్ మళ్లీ సెట్‌లో అడుగుపెట్టడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.