- Telugu News Photo Gallery Cinema photos Kriti Sanon won movie awards with beauty and acting in her Films
Kriti Sanon: అందం, అభినయంతో కృతి సనన్ కొల్లగొట్టిన సినిమా అవార్డులు ఇవే..
27 జూలై 1990న దేశ రాజధాని ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది 33 ఏళ్ళ వయ్యారి భామ కృతి సనన్. నటి కావడానికి ముందు కొంతకాలం మోడల్‌గా పనిచేసింది ఈ వయ్యారి. ఈమె చెల్లెలు నుపుర్ సనన్ కూడా ఒక హీరోయిన్. తెలుగు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 1: నేనొక్కడినేలో మహేష్ బాబుకి జోడిగా సినీ అరంగేట్రం చేసింది. ఈ కోమలి అందుకున్న అవార్డులు ఏంటో తెలుసుకుందాం..
Updated on: Oct 09, 2024 | 1:32 PM

2015లో తొలి బాలీవుడ్ చిత్రం హీరోపంతికి బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్, ఫిల్మ్ ఫెయిర్, IIFA ద్వారా నాలుగు ఫిమేల్ డెబ్యూ అవార్డ్స్ అందుకుంది అందాల ముద్దుగుమ్మ కృతి సనాన్.

తర్వాత 2018లో స్క్రీన్ అవార్డ్స్ వారిచే నొథింగ్ టు హైడ్ అనే అవార్డును కైవసం చేసుకుంది ఈ వయ్యారి భామ. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ లో స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందింది ఈ బ్యూటీ.

2019లో స్క్రీన్ అవార్డ్స్ వారిచే బాత్ లుకా చుప్పి సినిమాలో నటనకి నయీ అవార్డు గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. 2019లో లోక్‌మత్ స్టైలిష్ అవార్డ్స్ వేడుకలో మోస్ట్ స్టైలిష్ ఎంటర్‌టైనర్ అవార్డు గెలుచుకుంది ఈ వయ్యారి.

2020లో పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ లో స్టైలిష్ యాక్టర్ (ఫిమేల్) రీడర్స్ ఛాయిస్ అవార్డు సొంతం చేసుకుంది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, IIFA అవార్డ్స్ 2022, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ ద్వారా మిమీ చిత్రానికి నాలుగు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది.

2023లో బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ వారిచే మోస్ట్ స్టైలిష్ యాక్టర్ (ఫిమేల్) అవార్డును కైవసం చేసుకుంది. మరో 15 సినిమాలకి నామినేట్ అయినప్పట్టికి.. అవి అందుకోలేకపోయింది ఈ వయ్యారి భామ.




