David Warner: ఇదెక్కడి మాస్ రా మావ.! టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో విలన్ గా వార్నర్..
వార్నర్ కోవిడ్ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి తెలుగు సినిమాల పాటలు, డైలాగ్‌లు రీల్స్ , వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన ఆటతో క్రికెట్ అభిమానులంటే కాదు.. ఇలా మన సినిమా డైలాగ్స్, సాంగ్స్ కు డాన్స్ చేసి సినీ లవర్స్ కు కూడా దగ్గరయ్యాడు వార్నర్.
ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక బంధం ఏర్పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన వార్నర్‌పై తెలుగు ప్రజల ఎంతో ప్రేమను పెంచుకున్నారు. వార్నర్ కోవిడ్ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి తెలుగు సినిమాల పాటలు, డైలాగ్‌లు రీల్స్ , వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన ఆటతో క్రికెట్ అభిమానులంటే కాదు.. ఇలా మన సినిమా డైలాగ్స్, సాంగ్స్ కు డాన్స్ చేసి సినీ లవర్స్ కు కూడా దగ్గరయ్యాడు వార్నర్. తెలుగు సినిమాలకు వీరాభిమాని అయిన డేవిడ్ వార్నర్ పలు తెలుగు సినిమాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నాడు.
ఇదంతా చూసి వార్నర్‌ని తెలుగు సినిమాల్లో నటింపజేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు కొందరు అభిమానులు. కానీ అది సాధ్యం కాలేదు. రీసెంట్ గా డేవిడ్ వార్నర్, రాజమౌళితో కలిసి క్రీడ్ ఓ ప్రకటన చేశాడు. స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ని సినిమాల్లో నటింపజేస్తే ఎంత ఇబ్బంది అవుతుందో సరదాగా ఈ యాడ్ లో చూపించారు. అయితే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం, డేవిడ్ వార్నర్ తెల్లటి చొక్కా ధరించి, తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో డేవిడ్ వార్నర్ సినిమాలో నటిస్తున్నాడనే వార్త కూడా వైరల్ గా మారింది. అయితే ఆయన ఏ సినిమాలో నటిస్తున్నాడా అని నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. కొంతమంది ‘పుష్ప2’ లో అని అంటున్నారు.కానీ దాంట్లో నిజం లేదని తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడని టాక్ విన్ వినిపిస్తుంది. షూటింగ్ జరుపుకుంటున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో డేవిడ్ వార్నర్ విలన్ గా నటిస్తున్నాడని అంటున్నారు. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తాడని వార్నర్ కోసం యాక్షన్‌తో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలను కూడా రూపొందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రికెటర్లు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది భారతీయ క్రికెటర్లు సినిమాల్లో నటించారు. కానీ విదేశీ క్రికెటర్లు భారతీయ సినిమాలో ప్రముఖ పాత్రలు పోషించలేదు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఓ తెలుగు సినిమాలో విలన్ గా నటించి టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.