Bigg boss 8 telugu: గంగవ్వ దెబ్బకు బిత్తరపోయిన విష్ణు ప్రియా.. నోటమాటరాకుండా చేసిందిగా..!
నయనిపవని, హరితేజ, తేజ, అవినాష్, మెహబూబ్, గౌతమ్.. ఇలా వచ్చిన వారందరూ యష్మీని నామినేట్ చేశారు. దాంతో యష్మీ డేంజర్ జోన్ లో పడింది. ఆమెను నామినేట్ చేసిన దానికంటే మణికంఠను ఎందుకు నామినేట్ చేయడం లేదు అని తెగ ఫీల్ అవుతుంది యష్మీ. నిన్నటి ఎపిసోడ్ లో తేజ మణికంఠను నామినేట్ చేస్తుంటే తెగ సంబరపడిపోయింది.
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ కాంటీన్యూ అయ్యింది. చూస్తుంటే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు యష్మిని గట్టిగానే టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే నయనిపవని, హరితేజ, తేజ, అవినాష్, మెహబూబ్, గౌతమ్.. ఇలా వచ్చిన వారందరూ యష్మీని నామినేట్ చేశారు. దాంతో యష్మీ డేంజర్ జోన్ లో పడింది. ఆమెను నామినేట్ చేసిన దానికంటే మణికంఠను ఎందుకు నామినేట్ చేయడం లేదు అని తెగ ఫీల్ అవుతుంది యష్మీ. నిన్నటి ఎపిసోడ్ లో తేజ మణికంఠను నామినేట్ చేస్తుంటే తెగ సంబరపడిపోయింది. రాక్షసానందం పొందింది. దాంతో అవినాష్ యష్మీని నామినేట్ చేస్తూ.. మీకు ఎందుకు అంత పగ.. మణికంఠను నామినేట్ చేస్తుంటే ఆంత ఆనందపడిపోతున్నావ్.? అని క్లాస్ తీసుకున్నాడు.
అవినాష్ తర్వాత వచ్చిన రోహిణి కూడా యష్మీని నామినేట్ చేస్తూ గట్టిగానే ఇచ్చిపడేసింది. నబీల్-పృథ్వీ ఆడినప్పుడు పృథ్వీకి ఆడటం చేతకాక.. ఓడిపోతే నువ్వెందుకు ఏడ్చావ్..? నువ్వు చేసిందే తప్పు.. మళ్లీ సంచాలక్‌గా ఉన్న ప్రేరణని తప్పు చేయమని చెప్పి.. ఆమెపై పగపెంచుకున్నావ్.. పృథ్వీ చాలా కష్టపడ్డాడూ.. కష్టపడ్డాడూ అంటే.. నబీల్ కాళ్లు చాపుకుని కూర్చున్నాడా? ఆంటూ లా పాయింట్ లాగింది. దాంతో యష్మీకి దిమ్మతిరిగింది.
ఆతర్వాత రంగంలోకి వచ్చిన గంగవ్వ విష్ణు ప్రియను నామినేట్ చేసింది. గంగవ్వ చెప్పిన పాయింట్ కు విష్ణు ప్రియా బిత్తరపోయింది. చెప్పింది ఒకే ఒక్క పాయింట్ కానీ మొఖం మీద కొట్టినట్టు చెప్పింది గంగవ్వ. విష్ణు ప్రియాను నామినేట్ చేస్తూ.. కాళ్లూ చేతులు బాగానే ఉన్నాయి కదా.. ఆట ఎందుకు ఆడటం లేదంటూ విష్ణు ప్రియని నామినేట్ చేసింది దెబ్బకు విష్ణు ప్రియా నోట మాటరాలేదు. ఆ తర్వాత రాయల్ టీమ్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగానే టీమ్ మొత్తం డిస్కస్ చేసి మెహబూబ్, అలాగే గంగవ్వను నామినేట్ చేశారు. గంగవ్వను టీ పెట్టలేదు అని అందని నామినేట్ చేశారు. రాయల్ టీమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.