Rana Daggubati : దగ్గుబాటి యంగ్ హీరో భారీ ప్రాజెక్ట్ ఏమైనట్టు.? ఉన్నట్టా.. లేనట్టా..?

దగ్గుబాటి యంగ్ హీరో రానా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా విరాట పర్వం సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ టాల్ హీరో. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

Rana Daggubati : దగ్గుబాటి యంగ్ హీరో భారీ ప్రాజెక్ట్ ఏమైనట్టు.? ఉన్నట్టా.. లేనట్టా..?
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 01, 2022 | 9:34 AM

Rana Daggubati : దగ్గుబాటి యంగ్ హీరో రానా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా విరాట పర్వం సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ టాల్ హీరో. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే గతంలో రానా ఓ భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో రానా గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చినా రుద్రమదేవి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దాంతో హిరణ్య కశ్యప సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకోసం భారీ కసరత్తులు చేశారు కూడా. ఈ మూవీ కోసం అమెరికాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టారు.

అయితే సెట్స్ పైకి వెళ్లే టైంలో కరోనా ఎంట్రీ ఇచ్చింది దాంతో ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. నిజానికి విరాట పర్వం సినిమా కూడా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ వాయిదా పడుతూ పడుతూ ఎట్టకేలకు ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు హిరణ్య కశ్యప సినిమా పరిస్థితి ఏంటి.? షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అని చేర్చించుకుంటున్నారు. అయితే గుణశేఖర్ ఇటీవల శాకుంతలం సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా  నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా కూడా విరాట పర్వం తర్వాత ఫ్రీ అయ్యాడు. అటు గుణశేఖర్ కూడా శాకుంతలం పని దాదాపు పూర్తి చేశేశాడు. దాంతో ఇప్పుడు హిరణ్య కశ్యప పై ఫోకస్ పెట్టనున్నారని. త్వరలోనే ఈ సినిమా పై కీలక అప్డేట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏంజరుగుతుందో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి