Pushpa Movie: ఇదెక్కడి క్రేజ్‌ సామీ.. 6 నెలలైనా తగ్గేదేలే అంటోన్న పుష్ప టీఆర్‌పీ రేటింగ్స్‌..

Pushpa Movie: అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది...

Pushpa Movie: ఇదెక్కడి క్రేజ్‌ సామీ.. 6 నెలలైనా తగ్గేదేలే అంటోన్న పుష్ప టీఆర్‌పీ రేటింగ్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2022 | 9:22 AM

Pushpa Movie: అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల భారీ విజయాన్ని నమోదు చేసుకుందీ చిత్రం. దేశ వ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తా చాటింది. ఇక సిల్వర్‌ స్క్రీన్‌పై వండర్‌ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు టీవీల్లో కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడోసారి కూడా మంచి టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిందీ చిత్రం.

పుష్ప తొలిసారి థియేటర్‌లో విడుదలైనప్పుడు 22.54 రేటింగ్ రాగా, రెండో సారి 12.87 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా మరోసారి టెలికాస్ట్‌ అయ్యి 9.59 రేటింగ్‌ను దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిబట్టే పుష్ప క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌కు పాట్నర్‌గా మారిన పుష్ప, ఆ సామ్రాజ్యాన్ని ఎలా ఏలాడన్న కథాంశంతో సీక్వెల్ తెరకెక్కుతోంది. నిజానికి పుష్ప2 చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే అనుకున్న సమయానికంటే సినిమా చాలా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పుష్ప ఊహించినదానికంటే భారీ విజయాన్ని అందుకోవడంతో సుకుమార్‌ సీక్వెల్‌పై మరింత దృష్టిసారించాడు. ఆ కారణంగానే సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..