AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సలు ఊహించలేదు గురూ.. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కీలక పాత్రలో స్టార్ హీరోయిన్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మొన్నటివరకు కాంట్రవర్సీలతో సావాసం చేసిన వర్మ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. మొన్నామధ్య మంచి సినిమాలు చేస్తా అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఓ హారర్ సినిమా చేస్తున్నాడు.

అస్సలు ఊహించలేదు గురూ.. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కీలక పాత్రలో స్టార్ హీరోయిన్
Rgv
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2025 | 3:34 PM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ ఇటీవలే  ‘శారీ’ అనే సినిమా చేసి రిలీజ్ చేశారు. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ పోలీసు కేసులో చిక్కుకొని బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దేనికి భయపడని ఆర్జీవీ.. తన మనసులో మాట కూడా మొఖంమీద చెప్పేస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు ఆర్జీవీ.

23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!

ఆర్జీవీ సినిమాలు ఇటీవల పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరోసారి శివ లాంటి సినిమా చేసి.. తన మార్క్ చూపిస్తారని ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసారి రామ్ గోపాల్ వర్మ ఓ పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నారని తెలుస్తుంది. గతంలో రామ్ గోపాల్ వర్మ ఎన్నో హారర్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇప్పుడు మరోసారి హారర్ సినిమా తెరకెక్కించనున్నారు. పోలీస్‌ స్టేషన్‌ మే భూత్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు ఆర్జీవీ. ఈ సినిమాలో జెనిలియా కీ రోల్‌ పోషిస్తుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.

అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ..తాజాగా రామ్ గోపాల్ వర్మ రమ్యకృష్ణ కీ రోల్ చేస్తున్నారని అనౌన్స్ చేశారు. అలాగే రమ్యకృష్ణ పోస్టర్ ను కూడా వదిలారు వర్మ. పోలీసు స్టేషన్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్‌ దెయ్యంగా మారి పోలీసులకు వెంటాడటం అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. మనోజ్‌ భాజ్‌పాయి కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి