AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: హీరో రామ్‌పై అభిమానం.. పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా?

గతేడాది రామ్‌ నటించిన ది వారియర్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడీ లోటును తీర్చడానికి ఊరమాస్‌ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటిస్తోన్న స్కంద సెప్టెంబర్‌ 28న గ్రాండ్‌గా విడదల కానుంది. తెలుగులో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే రామ్‌ వీరాభిమాని ఒకరు పుట్టిన బిడ్డకు..

Ram Pothineni: హీరో రామ్‌పై అభిమానం.. పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా?
Ram Pothineni
Basha Shek
|

Updated on: Sep 16, 2023 | 2:24 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా వెలుగొందుతోన్న వారిలో ఉస్తాద్‌ రామ్‌ పొతినేని ఒకరు. అతని స్టైల్‌, డ్యాన్స్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌. జగడం, రెడీ, కందిరీగ, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్‌ శంకర్‌ తదితర హిట్‌ సినిమాల్లో నటించాడు. తనదైన యాక్టింగ్‌, స్టైల్‌తో ఎనర్జిటిక్‌ స్టార్‌గా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. గతేడాది రామ్‌ నటించిన ది వారియర్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడీ లోటును తీర్చడానికి ఊరమాస్‌ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటిస్తోన్న స్కంద సెప్టెంబర్‌ 28న గ్రాండ్‌గా విడదల కానుంది. తెలుగులో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే రామ్‌ వీరాభిమాని ఒకరు పుట్టిన బిడ్డకు ‘స్కంద’ అని నామకరణం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది . వివరాల్లోకి వెళితే.. హరిహర అనే వ్యక్తికి రామ్‌ పోతినేని అంటే చాలా అభిమానం. ఇటీవలే అతనికి పండంటి మగబిడ్డ జన్మించారు. తాజాగా నామకరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అబ్బాయికి ‘స్కంద’ అని పేరు పెట్టారు హరిహర దంపతులు. ఈ నామకరణం ఫంక్షన్‌కు రామ్‌ అభిమానులు కూడా హాజరయ్యారు. వారు ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బయటకు వచ్చింది. హీరో రామ్‌ అంటే తనకు చాలా అభిమానమని, అందుకు తన బిడ్డకు స్కంద అని పేరుపెట్టానని ఈ పోస్టులో చెప్పుకొచ్చారు హరిహర.

ఇవి కూడా చదవండి

స్కంద సినిమాలో యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సాయి మంజ్రేకర్‌ సెకెండ్‌ హీరోయిన్‌గా మెరిసింది. దగ్గుబాటి రాజా, శ్రీకాంత్‌, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్‌, పృథ్వీరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్లపై పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరి సంయుక్తంగా స్కంద సినిమాను నిర్మించారు. థమన్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్‌ 28న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. స్కంద సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్‌ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.

రామ్  అభిమాని సోషల్ మీడియా పోస్ట్

స్కంద సినిమా ట్రైలర్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.