Game Changer: మెగా అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

Game Changer: మెగా అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా మెగా సినిమా కాబట్టి.. ఆ మాత్రం మెగా జోష్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2025 | 10:54 AM

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ చరణ్ సోలోగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈమూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మరోవైపు టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రామ్ చరణే కట్ అవుట్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ట్రైలర్ గురించి అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. న్యూఇయర్ వేళ మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

న్యూఇయర్ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్రైలర్ విడుదల అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 2న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చరణ్ పంచె కట్టుతో రాజకీయ నాయకుడి లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్