AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బొబ్బిలి రాజా, చంటిగా ఆ ఇద్దరు హీరోయిన్స్.. వెంకీమామను దించేశారుగా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. చాలా కాలం తర్వాత ఈ మూవీతో ఒకప్పటి ఫ్యామిలీ హీరో వెంకీని చూపించబోతున్నానని ఇదివరకే అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Tollywood: బొబ్బిలి రాజా, చంటిగా ఆ ఇద్దరు హీరోయిన్స్.. వెంకీమామను దించేశారుగా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Meenakshi Chaudhary, Aishwa
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2024 | 9:29 PM

Share

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు రెడీగా ఉన్నాయి. 2025 ప్రారంభంలో విడుదల కానున్న సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం ఒకటి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా రమణ గోగుల పాడిన గోదారి గట్టి మీద సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలోనే టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే అన్ని సినిమాల మాదిరిగా కాకుండా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ కాస్త భిన్నంగా ప్లాన్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

వెంకటేశ్ , ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరిలతో కలిసి ఫన్నీగా రీల్స్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు. ప్రమోషన్లలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తోన్న జిమ్మిక్కులతో ఈ సినిమాపై మరింత హై రేంజ్ బజ్ క్రియేట్ అయ్యింది. చాలా కాలం తర్వాత మరోసారి ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్ కనిపించనున్నారని ప్రమోషన్లతోనే చెప్పేశారు అనిల్ రావిపూడి. ఇక ఇప్పటివరకు రీల్స్ ద్వారా క్యూరియాసిటీని కలిగించిన ఈ మూవీ టీం.. ఇప్పుడు హీరోహీరోయిన్లకు వెంకీమామ ఐకానిక్ పాత్రల గెటప్స్ వేయించారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకటేశ్ తోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరిలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొననారు. అందులో వెంకీ సూపర్ హిట్ చిత్రాల్లోని పాత్రలతో సందడి చేశారు. అనిల్ రావిపూడి జయం మనదేరా సినిమాలోని మహాదేవ నాయుడిగా, చంటి సినిమాలోని చంటి పాత్రలో ఐశ్వర్య రాజేశ్, బొబ్బిలి రాజాగా మీనాక్షి చౌదరి రెడీ అయ్యారు. ఇక ఘర్షణ సినిమాలోని డీసీపీ రామచందర్ పాత్రలో సందడి చేశారు నిర్మాత దిల్ రాజు. ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ప్రమోషన్లలో డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రియేటివిటీ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?