Kalki 2898 AD: కల్కి పార్ట్ 2లో కృష్ణుడిగా కనిపించనున్న స్టార్ హీరో.. డైరెక్టర్ ఏమన్నారంటే..

ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే.

Kalki 2898 AD: కల్కి పార్ట్ 2లో కృష్ణుడిగా కనిపించనున్న స్టార్ హీరో.. డైరెక్టర్ ఏమన్నారంటే..
Kalki 2898 Ad
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2024 | 8:34 PM

టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి పాన్ ఇండియన్ సెలబ్రిటీలు కీలకపాత్రలు పోషించారు. హిందూ ఇతిహాసం దశావతారలోని చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించారు నాగ్ అశ్విన్. ఇందులో విజయ్ దేవరకొండ అర్జునుడిగా, ప్రభాస్ కర్ణుడిగా కనిపించారు. మహాభారతంలోని సందర్భానుసార సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించారు. ఇక చివరగా కృష్ణావతారం తెరపై చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. కానీ కృష్ణ పాత్రలో ఎవరు నటించారు అనేది సస్పెన్స్ క్రియేట్ చేశారు డైరెక్టర్.

ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించింది ఎవరు అంటూ నెటిజన్స్ సెర్చ్ చేయగా.. సూరరై పోట్రు సినిమాలో సూర్య స్నేహితుడిగా నటించిన బాలసుబ్రమణ్యం. ఇదిలా ఉంటే రెండో భాగంలో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించినట్లుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. “పార్ట్ 1లో కృష్ణ పాత్ర చాలా సేపు కనిపించడం లేదని, అందుకే అతని ముఖం స్పష్టంగా కనిపించలేదని, ఆ పాత్రను ఎక్కువ కాలం చూపించాల్సిన పరిస్థితి ఉంటే తప్పకుండా నటుడు మహేష్‌ నటించేలా చేస్తాను” అని అన్నారు.

దాదాపు రూ.600 కోట్లతో రూపొందిన ఈ కల్కి మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. త్వరలో సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2వ సినిమాగా నిలిచింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..